Vastu tips: ఇంట్లో డ్రైనేజ్ వ్యవస్థ ఇలా ఉంటే ధనలాభం; లేదంటే అపార నష్టం!!
ఇల్లు కట్టుకోవడానికి ఏ విధంగా అయితే మనం వాస్తు నియమాలను అనుసరించాలో అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలి. అంతే కాదు ఇంటి డ్రైనేజీ వ్యవస్థ కూడా ఖచ్చితంగా వాస్తు నియమాలను అనుసరించి ఉండాలి. లేకపోతే ఆ ఇంట్లో ఆర్థిక నష్టాలు కలుగుతాయి. కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మన ఇంట్లో ఉపయోగించినటువంటి నీళ్లు పారుదల వ్యవస్థ పక్కాగా వాస్తు ప్రకారం ఉండాలి. ఇంట్లో నీటి పారుదల వ్యవస్థ సరిగా లేకపోతే, నీళ్లు పారినట్టే డబ్బులు కూడా అనవసరంగా వృధా ఖర్చు అయి పోతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దిగజారి పోతాయి. కాబట్టి ఇల్లు నిర్మించుకునే వాళ్లు డ్రైనేజీ వ్యవస్థ పైన కూడా పూర్తి అవగాహనతో నిర్మించుకోవాలి.
ఇంట్లో ఏ విధంగా డ్రైనేజీ వ్యవస్థ ఉంటే ఆర్థికంగా బలంగా ఉంటాము? నీటిపారుదల వ్యవస్థ ఏ వైపున ప్రవహిస్తుంటే నష్టం జరుగుతుంది ప్రస్తుతం మనం తెలుసుకుందాం . వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు పల్లంగా, పడమర ఎత్తుగా ఉండాలి. దక్షిణం ఎత్తుగా, ఉత్తరం పల్లంగా ఉండాలి. నీరు కూడా పల్లానికి ప్రవహించాలి. అంటే ఇంట్లో డ్రైనేజీ వ్యవస్థ తూర్పున, ఉత్తరం వైపు ప్రవహిస్తే మంచిది.

తూర్పువైపున నీటిపారుదల వ్యవస్థ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. కుటుంబ సభ్యుల పురోగతి బాగుంటుంది. జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవడానికి, అవరోధాలను అధిగమించటానికి తూర్పున నీటిపారుదల వ్యవస్థ దోహదం చేస్తుంది. ఇక ఉత్తర దిశలో నీరు ప్రవహించినప్పటికీ ఆ ఇంటికి శుభమే జరుగుతుంది. కుటుంబ ఆర్థిక పురోగతి ఉంటుంది.
ఇంటికి పశ్చిమ దిశలో నీటిపారుదల వ్యవస్థ పొరపాటున కూడా ఉండకూడదు. డ్రైనేజీ వ్యవస్థ పశ్చిమానికి ప్రవహించకూడదు. ఒకవేళ డ్రైనేజీ వ్యవస్థ పశ్చిమానికి వెళితే అది కుటుంబ సభ్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. డబ్బును, జ్ఞానాన్ని కోల్పోయేలా చేస్తుంది. కుటుంబ సభ్యులు అనవసరమైన కొన్ని తప్పిదాలు కూడా చేసే పరిస్థితి ఉంటుంది.
ఇంట్లో డ్రైనేజీ వ్యవస్థ దక్షిణ దిశలో ప్రవహిస్తే కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్యం ఎదుర్కోవాల్సి వస్తుంది. దక్షిణ దిశ యమ దిశ కాబట్టి దక్షిణ దిశలో నీరు ప్రవహిస్తే ఊహించని దారుణ ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది.కుటుంబంలో ఎవరు ఎంత కష్టపడినా ఫలితం లేకపోగా సమస్యలు పదేపదే వేధిస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications