Vastu tips: జీవితంలో సంపద, ఆరోగ్యం, ఆనందం కోసం ఈ వాస్తు చిట్కాలు పాటించండి!!

జీవితంలో సంపద, ఆరోగ్యం, ఆనందం కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇక ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే, మనం చేసే కొన్ని పనుల విషయంలో, వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని

ఇంటిని మనం ఎంత వాస్తు నియమాల ప్రకారం నిర్మించుకున్నప్పటికీ, ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో, మనం చేసే వివిధ పనుల విషయంలో వాస్తు నియమాలను పాటించకపోతే రకరకాల ఇబ్బందులు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎక్కడ ఏ వస్తువు ఉండాలో ఆ వస్తువు కచ్చితంగా ఉండి తీరాలని, అలాకాకుండా వాస్తుకు విరుద్ధంగా వస్తువులను ఎక్కడపడితే అక్కడ పెడితే ఆ ఇంట్లో ఉండేవారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. తెలిసీ తెలీక వాస్తు దోషాలకు పాల్పడి ఇబ్బందులు పడుతున్న వారు సరైన వాస్తు నియమాలను తెలుసుకోవటం మీకు లబ్ధిని చేకూరుస్తుందని అంటున్నారు.

వార్డ్ రోబ్ విషయంలో జాగ్రత్త.. ఇలా ఉంటే సంపద

వార్డ్ రోబ్ విషయంలో జాగ్రత్త.. ఇలా ఉంటే సంపద

ఇక వాస్తు శాస్త్ర నిపుణులు, సలహాలు సూచనల ప్రకారం ఎక్కడ ఏ వస్తువులు ఉంటే మేలు జరుగుతుంది. సంపద, శ్రేయస్సు మన వెంటే ఎలా ఉంటే ఉంటుంది. మనం సంతోషంగా జీవించడానికి ఏ విధంగా ఉంటే అవకాశం ఉంటుంది వంటి అనేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం నియమాల ప్రకారం ఎప్పుడు మన ఇంట్లో ఉండే వార్డ్ రోబ్ దక్షిణం దిశలో లేదా నైరుతి దిశలో ఉండాలి. ఇంటి ఉత్తర దిశ వైపు వార్డ్ రోబ్ తలుపు తెరుచుకునేలాగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనకు సంపదకు సంబంధించి ఎటువంటి నష్టాలు జరగవు. ఇంట్లో సంపద సమృద్ధిగా ఉండడంతో పాటు, ఆ ఇంట్లోని వాళ్లంతా సంతోషంగా ఉంటారు.

ఇంట్లో ఈ డెకరేషన్ వస్తువులు తెచ్చి పెట్టుకోండి.. ఫలితం చూడండి

ఇంట్లో ఈ డెకరేషన్ వస్తువులు తెచ్చి పెట్టుకోండి.. ఫలితం చూడండి


ఇక ఇంట్లో అక్వేరియం పెట్టుకోవడం వల్ల కూడా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. ఇంట్లో ప్రవహించే నీరు ఉన్న అక్వేరియం ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంతోషం వెల్లివిరిస్తుందని, అక్వేరియం ఇంట్లోకి సానుకూల శక్తులను తీసుకువస్తుందని చెబుతున్నారు. శ్రేయస్సును, సంపదను పెంచడంలో అక్వేరియం ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అంతేకాదు వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో డబ్బులు ఆకర్షించడానికి వేణువును ఉంచుకుంటే మంచిదని చెబుతున్నారు. ఇంట్లో మీరు రెండు వేణువులను కలిపి వేలాడదీస్తే అది మన కెరీర్ కు ఎంతో సహాయం చేస్తుందని, కుటుంబానికి కావలసిన శ్రేయస్సును తెస్తుందని చెబుతున్నారు.

బెడ్ రూమ్ విషయంలో జాగ్రత్త

బెడ్ రూమ్ విషయంలో జాగ్రత్త


ఇక వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్రూంలో మంచం ముందు అద్దాలను ఉంచడం మానేయాలని, అది ఇంట్లోని గృహస్థుల శక్తిని హరించే అనారోగ్యం పాలు చేస్తుందని చెబుతున్నారు. ఇక పడుకుని నిద్రించే సమయంలో తల దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలని, ఒకవేళ అలా వీలు కాకపోతే ముఖం ఈశాన్యం వైపు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. పొరపాటున కూడా ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించకూడదని చెబుతున్నారు. నిద్రపోయే భంగిమ విషయంలో సరైన వాస్తు నియమాలు పాటించకపోతే కూడా ఆ కుటుంబ సభ్యుల అనారోగ్యాలతో ఇబ్బంది పడతారని, రకరకాల సమస్యలతో సతమతమవుతారని చెబుతున్నారు.

ఇక బెడ్ రూమ్ విషయంలో ఇవి కూడా ముఖ్యమే

ఇక బెడ్ రూమ్ విషయంలో ఇవి కూడా ముఖ్యమే


ఇక మంచం క్రింద చెత్త చెదారం, ఇనుప వస్తువులు లేకుండా చూసుకోవాలని, బాత్ రూ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచరాదని చెప్తున్నారు. ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవడమే కాకుండా, ఇంట్లో పెట్టుకునే వివిధ వస్తువుల విషయంలోనూ, చేసే వివిధ పనుల విషయంలోనూ వాస్తు నియమాలను పాటించడం వల్ల ఆ ఇల్లు సంతోషంగా, సుఖశాంతులతో, సంపదకు కేంద్రంగా ఉంటుందని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వాస్తు నిపుణుల సలహాలు, నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+