vastu tips: ఇంట్లోకి అనుకోని ఈ అతిధులు వస్తే సంపద వర్షం కురుస్తుంది!!

వాస్తుశాస్త్ర నియమాల ప్రకారం ఇంటిని నిర్మించుకుంటాం. ఇంట్లో పెట్టుకున్న వస్తువులను కూడా వాస్తునియమాలను అనుసరించి పెట్టుకుంటాం. పక్కాగా వాస్తు ఫాలో అయినప్పటికీ మనకు తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల వాస్తుదోషాలు చోటుచేసుకుంటాయి. వాస్తు దోషాలు ప్రధానంగా ఇంట్లోని ప్రశాంతతను దూరం చేసి ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతాయి. అయితే ఆర్ధిక ఇబ్బందులని దూరంచేసి కనకవర్షం కురిపించే కొన్ని సంకేతాలు కూడా అప్పుడప్పుడు మనకు ఇంట్లో కనిపిస్తాయి.

ఓ 5 సంకేతాలు ఇంటికి విపరీతమైన ధనలాభాన్ని చేకూరుస్తాయి. ఇంట్లోకి తాబేలు రావడం అనేది శుభ పరిణామంగా చెప్పాలి. తాబేలు ఇంట్లోకి వస్తే ఇంటికి సానుకూల శక్తిని తీసుకువస్తుంది. తాబేలు శ్రీమహావిష్ణువు యొక్క కూర్మావతారాన్ని సూచిస్తుంది. తాబేళ్లు ఇంట్లోకి రావడాన్ని లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా భావిస్తారు. తాబేలు ఇంటికి వస్తే ఆ ఇంట్లోని వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంపద వర్షం కురుస్తుంది. శ్రేయస్సుతో పాటు, మానసిక ప్రశాంతత లభిస్తుంది.

vastu tips

నల్ల చీమలు ఇంట్లోకి వస్తే శుభ పరిణామం అని చెప్పాలి. నల్ల చీమలు సమూహంగా ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయనేది వాస్తు నిపుణుల అంచనా. చీమలు నోట్లో ఏదైనా తీసుకొని వస్తే ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతం. నల్ల చీమలు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అసలు రావని చెబుతారు.

ఇక చాలామంది కప్పలను చూస్తే చిరాకు పడతారు కానీ కప్పలు రావడం కూడా శుభ సంకేతమని చెప్పాలి. కప్ప ఇంటికి వస్తే ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది. కప్పలు ఇంటికి వస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని చాలామంది నమ్ముతారు. అంతే కాదు ఇంట్లోకి రామచిలక వస్తే కూడా అదృష్టం గా పరిగణిస్తారు.

రామచిలుక కుబేరుడికి సంబంధం ఉంటుందని శుభానికి ప్రతీక అని చెబుతారు. రామచిలుకలు ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద వృద్ధి జరుగుతుందని, వ్యాపారం లో లాభాలు వస్తాయని, వసూలు కాని రుణాలు కూడా వసూలవుతాయని చెబుతారు. అందుకే పూర్వీకులు చాలా మంది తమ ఇళ్ళలో చిలుకలు వచ్చి వెళ్లేందుకు సానుకూల వాతావరణం ఉండేలా చూసేవారు.

అంతేకాదు ఇంటికి రెండు తలల పాము వస్తే లక్ష్మీదేవి నడిచొస్తుందని చెబుతారు. రెండు తలల పామును లక్ష్మీదేవి వాహకంగా చెబుతారు. రెండు తలల పాము చాలా అరుదుగా కనిపిస్తుంది. ఎవరికీ హాని చేయని ఈ పాము ఇంట్లోకి వస్తే డబ్బుకు, ధాన్యానికి కొదవ ఉండదని చెబుతారు.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర అభిప్రాయాలు,సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+