వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: వంటగదిలో ఈ ఒక్క వస్తువు ఉంటే సంపదతో పాటు బంధాలు బలోపేతం!!

వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిలో ఒక వస్తువును పెడితే ఆ వస్తువు వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

|
Google Oneindia TeluguNews

ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదనలోనూ , గొప్పగా ఎదగాలనే ఆశయంతోను పోటీపడి ముందుకు సాగుతున్నారు. ఇక లక్ష్మీదేవి ఆశీస్సులు తమకు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే చాలాసార్లు ఇళ్లల్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగడం, ఆర్థిక స్థితి పై చెడు ప్రభావం చూపించడం, ఎంత కష్టపడినా ఫలితం లేకపోవడం వంటి ప్రభావాలు ఉంటాయి.

పూర్వీకుల ఆశీర్వాదం లేకపోవటం వల్ల వాస్తు దోషాలు

పూర్వీకుల ఆశీర్వాదం లేకపోవటం వల్ల వాస్తు దోషాలు

మనకు తెలిసి తెలియకుండా చేసే వాస్తు దోషాల వల్లే ఇటువంటి ఫలితాలు ఉంటాయని విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇటువంటి సమస్యల నుంచి బయటపడటం కోసం చిన్న చిన్న వాసు చిట్కాలను లేదా పరిహారాలను పాటించాలని కూడా చెబుతున్నారు.

పూర్వీకుల ఆశీర్వాదం లేకపోవడం వల్ల అనేక సమస్యలను చాలామంది ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అయితే ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల కూడా ఈ పరిస్థితులను ఎదుర్కోవచ్చని, కొన్ని వస్తువుల కారణంగా మన పూర్వీకులు సంతోషంగా ఉంటారని సూచిస్తున్నారు.

వాస్తు చిట్కాలు పాటిస్తే లాభమే

వాస్తు చిట్కాలు పాటిస్తే లాభమే

సహజంగా వాస్తు చిట్కాలు అన్ని చాలా సింపుల్ గా చేయగలిగే చిట్కాలే ఉంటాయి. వాటి కోసం పెద్దగా ఖర్చు కూడా కాదు. అటువంటి చిట్కాలను పాటించడం వల్ల వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. జరిగితే లాభం మాత్రం అపరిమితంగా జరుగుతుంది. కాబట్టి వాస్తు శాస్త్ర నిపుణులు సూచించే వాస్తు చిట్కాలను పాటించడంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పొచ్చు.

వంటగదిలో ఈ ఒక్క వస్తువు పెట్టండి .. ఆపై మీరే చూడండి

వంటగదిలో ఈ ఒక్క వస్తువు పెట్టండి .. ఆపై మీరే చూడండి


వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిలో ఒక వస్తువును పెడితే ఆ వస్తువు వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వంట గదిలో వాస్తు శాస్త్రం ప్రకారం ఒక చిన్న మట్టికుండను, లేదా మట్టితో తయారు చేసిన గిన్నెను, లేదా చిన్న మట్టితో తయారుచేసిన కలశాన్ని నీళ్లతో నింపి ఉంచినట్లయితే మంచి జరుగుతుందని సూచిస్తున్నారు.

పూర్వీకుల ఆశీర్వాదం ఈ వస్తువు పెడితే లభిస్తుంది

పూర్వీకుల ఆశీర్వాదం ఈ వస్తువు పెడితే లభిస్తుంది

పూర్వీకులు నీళ్లతో నిండిన ఆ మట్టి కుండలో నివసిస్తారని చెబుతున్నారు. ఇక అటువంటి పరిస్థితిలో పూర్వీకుల ఆశీర్వాదం ఆ ఇంట్లోని వారికి ఎప్పుడూ ఉంటుందని, ఇంట్లో కష్టాలకు చెక్ పడుతుందని సూచిస్తున్నారు. ఈ చిన్న పని మన కిచెన్ లోని వాస్తు దోషాలను తొలగించి మన జీవితం ప్రశాంతంగా సుఖంగా సాగేలా చేస్తుందని చెప్తున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Vastu Shastra experts say If this earthen pot is there in the kitchen, along with wealth, the family bonds become stronger.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X