vastu tips:హోలీనాడు ఈ పనులు చేస్తే ఏడాదంతా సంపద వర్షం!!

2024 సంవత్సరంలో హోలీ పండుగ చాలా ప్రత్యేకమైనదిగా చెబుతున్నారు. హోలీ పండుగ నాడే చంద్రగ్రహణం ఏర్పడడం, హోలీ పండుగ నాడు మూడు శుభ యోగాలు ఏర్పడడం వంటి కారణాలతో ఈసారి హోలీ పండుగ చాలా ప్రత్యేకంగా చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం నిపుణులు. అయితే హోలీ పండుగ సందర్భంగా లక్ష్మీ కటాక్షం కావాలనుకునే వారు కొన్ని వాస్తు నియమాలను కూడా పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

హోలీ పండుగ రోజు సంపద,మరియు సంతోషం కావాలంటే కొన్ని పనులను చేయాలని, ఇక చేయకూడని పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. హోలీ పండుగనాడు ముఖ్యంగా ఇల్లు శుభ్రం చేసుకుని, విష్ణువును పూజించాలని ఇంట్లో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని, ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

vastu tips If you do these things on Holi it will rain wealth throughout the year

పండుగ రోజు ఎవరిపైన కోప తాపాలు లేకుండా సంతోషంగా ఉండాలని సూచిస్తున్నారు. హోలీ పండుగను ఇంటి ప్రాంగణంలోనే జరుపుకోవాలని, పగటి సమయంలోనే హోలీ ఆడుకోవాలని సూచిస్తున్నారు. పొరపాటున కూడా ఎవరిని అవమానించడం హోలీ పండుగ నాడు మంచిది కాదని చెబుతున్నారు. హోలీ పండుగ నాడు చీకటి పడిన తర్వాత హోలీ ఆడితే దరిద్రం వస్తుందని ఈ చర్యకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

హోలీ పండుగ నాడు మద్యం సేవించరాదని, ఎవరిని దుర్భాషలాడకూడదని, ఎవరికీ ఎటువంటి హాని చేయకూడదని, గొడవలు పెట్టుకో కూడదని చెబుతున్నారు. హోలీ పండుగ రోజు ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదని, తెల్లటి వస్తువులకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. చాలా పవిత్రంగా విష్ణువును, రాధాకృష్ణులను పూజ చేసే పండుగ అయిన హోలీ పండుగను ఘనంగా భక్తి ప్రేమలతో జరుపుకోవాలని చెబుతున్నారు.

ఇక హోలీ పండుగ నాడు చేయకూడని పనులకు దూరంగా ఉండి, శ్రద్ధగా చేయాల్సిన పనులను చేస్తే లక్ష్మీదేవి కటాక్షం తో సంపద పెరుగుతుందని, సంతోషంగా జీవిస్తారని చెబుతున్నారు. మరింకెందుకు ఆలస్యం .. హోలీ పండుగను సంతోషంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో జరుపుకోండి. సుఖంగా జీవించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+