Vastu tips: ఈ వాస్తు తప్పులు చేస్తే ఇంట్లో గొడవలు ఖాయం.. జాగ్రత్త!!

చాలామంది గృహనిర్మాణం విషయంలోనే వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. గృహాన్ని నిర్మించుకున్న తర్వాత గృహాన్ని నిర్వహించడం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టరు. ఇంట్లో తమ అనుకూలతను బట్టి వస్తువులను సర్దుకుంటూ ఉంటారు. అయితే వాస్తులో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి? ఏ వస్తువులు ఎక్కడ పెట్టకూడదు? ఏ వస్తువుల వల్ల ఇంటికి ప్రతికూల ఫలితాలు వస్తాయి? సమస్యలు లేకుండా ఉండాలంటే ఇల్లు ఏ విధంగా నిర్వహించుకోవాలి? వంటి అనేక విషయాలను వెల్లడించారు.

వాటిలో కొన్నిటిని ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఇంటి నిర్వహణ సరిగా లేకుంటే ఇంట్లో తరచూ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ గొడవలు వారి మనశ్శాంతిని, ఇంటి ప్రశాంతతను దూరం చేస్తాయి. కాబట్టి ఇంట్లో గొడవలు జరగకుండా ఉండాలి అంటే మళ్లీ ఇంట్లో వాస్తు కు సంబంధించిన కొన్ని తప్పులను చేయకుండా ఉండాలి.

couplefight

అలాంటి వాటిలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఒకటి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో సాలెపురుగులు గూళ్ళు పెట్టకూడదు. ఇల్లంతా సాలెపురుగులు గూళ్ళు పెడితే అది ఇంటిలో ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. దాని ఫలితంగా ఇంట్లోని వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇంట్లో తరచూ ఘర్షణలు చోటు చేసుకోవడంతో పాటు, మనశ్శాంతి దూరమవుతుంది. అందుకు ఇంటిని సాలెపురుగులు లేకుండా చూసుకోవాలి. ఇంట్లో ఏర్పడే బూజును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

ఇక ఇంట్లో అవసరం లేని పేపర్లను, రసీదులు, ఇతర వస్తువులను ఉంచుకోవడం మంచిది కాదు. ఇది ఆర్థిక స్థితి పైన ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంట్లో అనవసరమైన, ఉపయోగించని వస్తువులను ఉంచుకుంటే ఆ కుటుంబంలో సఖ్యత లోపిస్తుంది. ఇంటి ప్రశాంతత భగ్నం అవుతుంది. కాబట్టి వెంటనే వాటిని తొలగించాలి.

ఇంటిని ఎప్పుడు నీట్ గా శుభ్రంగా సర్ది పెట్టుకోవాలి. ఇక అంతే కాదు మెట్లకింద వస్తువులను చిందరవందరగా పడేయడం, కిచెన్ లో పాడైపోయిన వస్తువులను పెట్టుకోవడం, పాడైపోయిన పదార్థాలను ఉంచుకోవడం, స్టోర్ రూమ్ నిండా చెత్తాచెదారం జమ చేయడం వంటి అనేక పనులు కుటుంబంలో చిరాకును పెంచుతాయని, తరచూ గొడవలు కారణమవుతాయని చెబుతున్నారు. ముందు ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే, ఇల్లు ఎప్పుడు శుభ్రంగా, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే లాగా ఉండాలి.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+