వాస్తు ప్రకారం మెయిన్ రోడ్డు పక్కన ఉండే ఇళ్లల్లో ఉండొచ్చా?
కొంతమంది సొంత ఇళ్లు ఆ ఊరికి మెయిన్ రోడ్డు పక్కనే ఆనుకొని ఉంటాయి. అవి గ్రామాలైనా, పట్టణాలైనా, నగరాలైనా రోడ్డుకు ఇరువైపులా రణగొణ ధ్వనులు ఖాయంగా వస్తుంటాయి. అసలు మనం ఇంట్లో ఉన్నామో, రోడ్డుమీద ఉన్నామో అర్థం కాదు. ఏ మాత్రం ప్రశాంతత ఉండదు. దుమ్ము, ధూళితోపాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. సొంత ఇల్లు కాబట్టి ఎందుకులే.. మన ఇంట్లోనే ఉందాం అని కొందరు, మెయిన్ రోడ్డు అయినా పర్వాలేదు.. అని అద్దెకు ఉండేవారు ఉన్నారు. అయితే వాస్తు ప్రకారం మెయిన్ రోడ్డుకు పక్కన ఉండే ఇళ్లల్లో ఉండొచ్చా? లేదా? అనే వివరాలను తెలుసుకుందాం.
మెయిన్ రోడ్డు ఇంటికి ఏ దిక్కున ఉందనేది అత్యంత ముఖ్యం.
ఇల్లు మెయిన్ రోడ్డుకు దక్షిణాన ఉండి, రోడ్డు ఉత్తరం వైపు ఉన్నా పర్వాలేదు
ఇల్లు పశ్చిమాన ఉండి, రోడ్డు తూర్పు వైపు ఉన్నా అది కూడా చాలా మంచిది.
ఇలా ఉండటంవల్ల సమాజంలో పేరు వస్తుంది.. సంపద పెరుగుతుంది.

మెయిన్ రోడ్డు దక్షిణం లేదా పశ్చిమం వైపు ఉంటే
ఇంటి ప్రహరీ గోడ బరువుగా, ఎత్తుగా ఉండాలి.
ఇలా లేకపోతే కుటుంబంలో ప్రశాంతత దెబ్బతింటుంది.
మెయిన్ రోడ్డు పక్కన ఇల్లు ఉన్నప్పుడు 'వీధి పోటు' ఉందేమో చూసుకోవాలి.
రోడ్డు నేరుగా వచ్చి మీ ఇంటిని గుచ్చుతున్నట్లు ఉండకూడదు.
ఈశాన్య ఉత్తరం, ఈశాన్య తూర్పు వంటివి మంచి ఫలితాలనిస్తాయి.
నైరుతి, ఆగ్నేయం లేదా వాయువ్యం వైపు నుండి వచ్చే వీధి పోట్లు ఆర్థికంగా నష్టాలను, అనారోగ్యాన్ని కలిగిస్తాయి.
వాస్తు కేవలం దిశలకే పరిమితం కాదు, చుట్టుపక్కల వాతావరణానికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది.
మెయిన్ రోడ్డుపై నిరంతరం వాహనాల శబ్దం, కాలుష్యం ఉండటం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి రాదు.
ఒకవేళ ఉన్నా అది కుదురుగా ఉండకుండా కుదుపులకు లోనవుతుంది.
రోడ్డు స్థాయి కంటే ఇల్లు తక్కువ ఎత్తులో ఉండకూడదు.
రోడ్డు కంటే ఇల్లు కనీసం 2 నుంచి 3 అడుగుల ఎత్తులో ఉండాలి.
మెయిన్ రోడ్డు పక్కన ఇల్లు ఉండటం వ్యాపార పరంగా లాభదాయకం.
వాస్తు పరంగా అన్నీ సరిగ్గా ఉంటే అపారమైన ధనలాభం కలుగుతుంది.
ప్రశాంతత కోరుకునే వారు రోడ్డుకు కొంచెం దూరంగా ఉండే ఇళ్లల్లో ఉంటారు.
మెయిన్ రోడ్డు పక్కనే ఉంటే, ఇంటి ముందు భాగంలో దట్టమైన చెట్లను పెంచాలి.
శబ్దాన్ని, దుమ్మును, వాస్తు దోషాలను ఇవి చాలావరకు తగ్గిస్తాయి.
రోడ్డు వైపు ఉండే గోడ బలంగా ఉండాలి. ఎత్తుగా ఉండాలి.
సౌండ్ ప్రూఫ్ కిటికీలు అమర్చుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ప్రధాన ద్వారం వద్ద దిష్టి బొమ్మలు లేదా వాస్తు పిరమిడ్లు ఉంచితే వ్యతిరేక శక్తి ప్రవేశించదు.












Click it and Unblock the Notifications