Vastu tips: ఈ ఆరు వస్తువులు ఇంట్లో ఉంటే డబ్బుకు ఎప్పటికీ కొరత ఉండదు!!
చాలామంది ఎంత కష్టపడి పని చేసినప్పటికీ ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక అటువంటివారు జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం పవిత్రంగా భావించే కొన్ని వస్తువులను ఇంట్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. ఆర్థిక కష్టాలు తొలగిపోయి, ఇంట్లో సంతోషం వెల్లి విరుస్తుంది.
ఇంట్లో ఆరు ప్రత్యేక వస్తువులు తెచ్చి సరైన స్థలంలో ఉంచితే డబ్బు సమస్యలు, అశాంతి సమస్యలు తొలగిపోతాయి. సంవత్సరం పొడుగునా సంతోషం, శ్రేయస్సు ఉంటాయి. మరి ఇంటికి తెచ్చుకోవలసిన ఆ ఆరు వస్తువులు ఏమిటో తెలుసుకుందాం. ఆర్దిక ఇబ్బందుల నుండి బయటపడటం కోసం ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్యమైన వస్తువులలో నెమలీకలు ఒకటి. నెమలిఈకలు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనవి. ఇంట్లో పెట్టుకుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. జీవితంలో సంతోషం, శ్రేయస్సు ఉంటుంది.

ఇక ఇంట్లో తులసి మొక్కను పెట్టుకుంటే ఇల్లు సంక్షోభం నుంచి బయటపడుతుంది. ఇంట్లో తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తులసి మొక్క ఉన్న ఇల్లు డబ్బుల తోటి, సిరిసంపదల తోటి తుల తూగుతుంది. ఇంట్లో తులసి మొక్క లేకపోతే, లేదా ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతే తులసి మొక్కను ఇంటికి తీసుకువచ్చి సరైన స్థానంలో పెట్టాలి.
వాస్తు ప్రకారం వెండి ఏనుగు ఇంట్లో అద్భుతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇంట్లో వెండి ఏనుగుని ఉంచటం వల్ల రాహు, కేతువుల దుష్ప్రభావాలు తగ్గుతాయి. వ్యాపారం, ఉపాధి బాగా మెరుగుపడతాయి.వెండి, ఇత్తడి,లేదా కంచు తో తయారు చేసిన తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
లోహపు తాబేలును ఉత్తరం వైపు ఉంచటం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషం వెల్లివిరుస్తుంది. అలాగే సంవత్సరంలోని పవిత్రమైన ఒక రోజున తీసుకుని వచ్చి పెట్టుకుంటే ఇంటికి మేలు జరుగుతుంది. లాఫింగ్ బుద్ధ నువ్వు ఎప్పుడు ఇంట్లో ఈశాన్య దిశలోనే పెట్టుకోవడం మంచిదని చెప్పబడింది.
చిన్న కొబ్బరికాయను ఇంటికి తీసుకువచ్చి ఒక గుడ్డలో చుట్టి సురక్షితమైన స్థలంలో పెట్టి దీపావళి రెండవ రోజు దానిని బయటకు తీసి సమీపంలోని నదిలో లేదా చెరువులో పడేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి జీవితంలో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే పైన చెప్పిన వస్తువులను ఇంటికి తెచ్చి పెట్టుకోండి. ఆపై ఫలితాన్ని మీరే స్వయంగా చూడండి.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications