vastu tips: ఇంట్లో ఈ ఒక్కటి ఉంటే చాలు.. ఆరోగ్యం.. ధనం.. అన్నింటా విజయం
వాస్తు శాస్త్రంలో సూర్యభగవానుడికి చాలా ప్రాశస్త్యం ఉంటుంది. భారతదేశంలో సూర్యుడిని చాలామంది పూజిస్తారు. సూర్యుడే మన జీవితంలో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని నిర్ణయించే దేవుడు. అటువంటి సూర్యకిరణాలు మన శరీరంపై పడితే, ఆయన దయ ఉంటే ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అయితే సూర్యుని కటాక్షం కోసం, మన జీవితంపై ఆయన మంచి దృష్టి పడడం కోసం ఇంట్లో ఒక పని చేస్తే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.
సూర్యుడు దయ కావాలి అనుకునేవారు సూర్యుడికి చిహ్నంగా రాగి సూర్యుడిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఇంటి ముఖద్వారం గోడపై సూర్యుడిని ఉంచటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుందని, అందులోనూ రాగితో చేసిన సూర్యుని విగ్రహం, లేదా హ్యాంగింగ్ ఎంతో శ్రేష్టమైనదిగా పరిగణించబడుతుందని చెబుతున్నారు. ఇంట్లో ఉండే రాగి సూర్యుడు ఇంటి మొత్తానికి గొప్ప శక్తి వనరుగా పరిగణించబడతారు.

సూర్యుని శక్తికి ప్రతీకైన రాగి సూర్యుడు ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకు విజయం, కీర్తి, శ్రేయస్సు లభిస్తాయి. ఇది ఇంట్లోని వ్యక్తుల మధ్య సామరస్యాన్ని కొనసాగించడానికి ఎంతగానో సహాయపడుతుంది.
రాగి సూర్యుడు ఇంట్లో పెట్టుకోవడం వల్ల దాని నుంచి వచ్చే శక్తి కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని పెంపొందిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తొలగిపోయి అది ఇంటికి శ్రేయస్సును జోడిస్తుంది. మంచి ప్రజాదరణ పొందాలనుకునేవారు వారింట్లో రాగి సూర్యుడు ఉంచుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.
ఏదైనా పనిలో విజయం సాధించాలన్నా కూడా ఆ ఇంట్లో రాగి సూర్యుడిని ఉంచడం విజయ సంకేతంగా భావిస్తారు. రాగి సూర్యుడిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ ప్రతిభ, ప్రభావాలకు తిరుగులేకుండా ఉంటుంది. ఆర్థిక లాభాలతో పాటుగా ప్రముఖమైన వ్యక్తుల పరిచయం కూడా దీనివల్ల కలుగుతుంది. రాగి సూర్యుడిని వ్యాపార స్థలాలలోనూ, ఆఫీస్ లలోనూ పెట్టుకోవడం వల్ల చేసే పనిలో పురోగతి ఉండడంతో పాటు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది.
ఇక తూర్పు దిక్కున తలుపులు, కిటికీలు లేని వారు కూడా ఆ వైపు గోడపై రాగి సూర్యుడిని పెడితే ఆ వాస్తు దోషం నుండి బయటపడే అవకాశం ఉంటుంది. కెరీర్ మెరుగుదల కోసం, ఆఫీసులో కూడా తూర్పు దిశలోనే రాగి సూర్యుడు పెట్టుకుంటే మంచిదని సూచించబడింది. మొత్తంగా ఇంట్లో రాగి సూర్యుడు ఉంటే ఆరోగ్యం, విజయం, ఆర్థిక లాభం, కుటుంబ శ్రేయస్సు కలుగుతుందని చెప్పబడింది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications