వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: తాళాలు, తాళంచెవులను పెట్టేటప్పుడు ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి

తాళాలు, తాళంచెవులను పెట్టేటప్పుడు సరైన దిశలో పెట్టాలి. అలాగే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలని అంటున్నారు వాస్తు నిపుణులు.

|
Google Oneindia TeluguNews

ఇల్లు మనం ఎంత వాస్తు ప్రకారం నిర్మించుకున్నప్పటికీ ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో వాస్తు నియమాలు పాటించాలని అనేక సందర్భాల్లో తెలుసుకున్నాం. ముఖ్యంగా ఇంట్లో తాళాలు, తాళం చెవులు పెట్టే విషయంలో కూడా జాగ్రత్త వహించాలని సూచించబడింది. ఇంట్లో తాళాలను, తాళం చెవులను సరైన దిశలో పెడితే మీ ఇంటికి అదృష్ట తాళాలు తెరవబడతాయని చెబుతున్నారు.

తాళాలు , తాళం చెవుల విషయంలో తెలుసుకోవాల్సిన విషయాలివే

తాళాలు , తాళం చెవుల విషయంలో తెలుసుకోవాల్సిన విషయాలివే

చాలామంది ఇళ్లల్లో తాళాలు, తాళం చెవులే కదా అని ఎక్కడపడితే అక్కడ పడేస్తూ ఉంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. తాళాలు, తాళంచెవులను కచ్చితంగా ఇంట్లో నిర్దిష్టమైన ప్రాంతంలోనే పెట్టాలని, ఎక్కడపడితే అక్కడ పెట్టడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో తాళాలు, తాళంచెవుల విషయంలోఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలని చెబుతున్నారు.

హాల్లో తాళాలు పెడుతున్నారా?

హాల్లో తాళాలు పెడుతున్నారా?

ఇంట్లో మనం తాళం చెవులను, తాళాలను పెట్టేటప్పుడు హాల్లో పెట్టకూడదు అని చెబుతున్నారు. ఇంట్లోకి బయట నుండి వచ్చే కొత్తవారు ఇంట్లోని తాళాలను, తాళం చెవులను చూడడం మంచిది కాదని సూచిస్తున్నారు. దీనివల్ల జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు వస్తూనే ఉంటాయని, అందుకే పొరపాటున కూడా హాల్లో తాళాలను, తాళం చెవులను ఉంచకూడదని చెబుతున్నారు.

తాళాలు అక్కడ పెడితే ప్రతికూల ఫలితాలు

తాళాలు అక్కడ పెడితే ప్రతికూల ఫలితాలు

చాలామంది ఇంట్లో ఆగ్నేయంలో తాళం చెవులను పెడుతూ ఉంటారు, వంటగది సమీపంలో పూజా స్థలం దగ్గర తాళం చెవులను పెట్టడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయంటున్నారు. మనం తాళం చెవులను ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకుంటాం కాబట్టి వంటగదికి, పూజ స్థలానికి దగ్గరగా పెట్టడం మంచిది కాదని చెబుతున్నారు.

తాళాలు , తాళం చెవులను పెట్టేందుకు నిర్దిష్ట స్థానం

తాళాలు , తాళం చెవులను పెట్టేందుకు నిర్దిష్ట స్థానం

ఇక తాళం చెవులను పెట్టేదిశ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పశ్చిమ దిశలో తాళం చెవులను పెట్టడం మంచిది అని చెబుతున్నారు. ఒకవేళ ఏదైనా ఆస్తిని విక్రయించుకోవాలని మీరు భావించినప్పుడు, ఆ ఆస్తికి సంబంధించిన తాళం చెవులను ఇంటికి నైరుతి దిశలో ఉంచవచ్చని సూచిస్తున్నారు. అలా పెట్టడం వల్ల ఆర్థిక లావాదేవీలు త్వరిత గతిన జరుగుతాయని, తద్వారా మంచి ఫలితాలు వస్తాయని సూచిస్తున్నారు. మనం నిత్యం ఉపయోగించే ఇంటి తాళం చెవులను, వాహనాల తాళం చెవులను, ఆఫీస్ లాకర్ తాళంచెవులను వాయువ్య దిశలో ఉంచడం వల్ల మంచి జరుగుతుందని, ఇది ఎన్నో శుభ ఫలితాలను కలిగిస్తుందని చెబుతున్నారు.

తాళాలు, తాళం చెవులు పెట్టేందుకు ఇవే వాడండి

తాళాలు, తాళం చెవులు పెట్టేందుకు ఇవే వాడండి

ఇక తాళం చెవులను, తాళాలను పెట్టడం కోసం చెక్క హ్యాంగర్ లను ఉపయోగించడం శ్రేయస్కరంగా ఉంటుందని, పొరపాటున కూడా ప్లాస్టిక్ హ్యాంగర్లు ఉపయోగించవద్దని సూచిస్తున్నారు. చెక్క హ్యాంగర్ తప్ప, మరే ఇతర మెటీరియల్ తో తయారు చేసిన హ్యాంగర్స్ అయినా ఇంట్లో చాలా ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
According to vastu locks and keys should be put in the right direction. Also Vastu experts say to know some important things about keys palcement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X