vastu tips: టెర్రస్ మీద వీటిని తప్పకుండా పెట్టండి.. మీకు ఆర్ధిక ఇబ్బందులే ఉండవు!!
టెర్రస్ మీద పాడైపోయిన వస్తువులు, చెత్తా చెదారం పెట్టకుండా, వాస్తు నియమాల ప్రకారం కొన్నిటిని తప్పకుండా పెట్టాలని, అలా అయితే మీకు ఆర్ధిక ఇబ్బందులే ఉండవని చెప్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
ఇంటిని నిర్మించుకోవడానికి ఏ విధంగా వాస్తు శాస్త్ర అవసరం అవుతుందో, అదేవిధంగా ఇంటి లోపల, ఇంటి బయట ఉంచే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలు కచ్చితంగా పాటించాలి. ఇల్లు ఎంత వాస్తు ప్రకారం నిర్మించుకున్నప్పటికీ ఇంటి లోపల, ఇంటి బయట పెట్టిన వస్తువులు మన జీవితం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వాస్తు నియమాలను అనుసరించి ఇంట్లో, ఇంటి బయట వస్తువులను పెట్టుకుంటే ఆనందంతో పాటు ప్రశాంతత లభిస్తుంది. ఇక ఇంట్లో పెట్టుకునే వస్తువులు మాత్రమే కాకుండా ఇంటిపై, టెర్రస్ మీద పెట్టే వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు.

టెర్రస్ పైన ఈ వస్తువులు పెడుతున్నారా? అయితే దరిద్రం
చాలామంది ఇంటిపైన వినియోగించని అనేక వస్తువులను పడేస్తూ ఉంటారు. పాడైపోయిన వస్తువులు, చెత్తాచెదారం ఇంటికి పైన జమ చేస్తూ ఉంటారు. ఎప్పుడో కాని టెర్రస్ మీదకు వెళ్ళం కదా అని ఏది పడితే అది పైన పోగు పెడుతూ ఉంటారు. ఇంటి టెర్రస్ పైన ఎప్పుడూ పాత వస్తువులను, పాడైపోయిన వస్తువులను పెట్టకూడదు. చెత్తాచెదారాన్ని జమ చేయకూడదు. అలా చేస్తే ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇంటి పైన జమ చేసిన చెత్త ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు పేదరికం తెచ్చి పెడుతుంది. కాబట్టి ఇంటి పైన కప్పుపై ఎప్పుడు చెత్తాచెదారాన్ని జమ చేయకుండా ప్రతికూలతను తొలగించే ప్రయత్నం చేయాలి.

ఇంటి టెర్రస్ పై పెట్టుకోవాల్సినవి ఇవే
ఇంటి టెర్రస్ పైన చెత్త ఉంటె అది మన తలభారంగా మారుస్తుంది. అందుకే వాటిని తీసేసి సానుకూల శక్తి ప్రసరించే విధంగా ఇంటి పైన చక్కని గార్డెనింగ్ చేయవచ్చు. వాస్తు ప్రకారం మన ఇళ్లల్లో పెంచుకోవలసిన మొక్కలను ఇంటి టెర్రస్ పైన అందంగా పెంచుకుంటే, అది ఇంటికి శ్రేయస్సును తీసుకొస్తుంది. ఇంటి పైకప్పును ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆ కుటుంబ సభ్యులకు సంతోషం, శ్రేయస్సు, అదృష్టం కలుగుతాయి. అప్పుడప్పుడు టెర్రస్ మీద కూర్చోవటం కుటుంబానికి ఆహ్లాదం ఇస్తుంది.

కుటుంబానికి శ్రేయస్సు, సంతోషం కోసం టెర్రస్ పై ఈ పని చెయ్యండి
టెర్రస్ పైన మొక్కలు పెంచడం శుభప్రదం అని వాస్తులో కూడా సూచించబడింది. మొక్కల్ని పెంచడం వల్ల పర్యావరణం శుభ్రం అవ్వడమే కాకుండా, ఆ ఇంట్లోని కుటుంబ సభ్యుల మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా పూల మొక్కలను ఇంటి టెర్రస్ పైన పెట్టుకున్నట్లయితే ఆ మొక్కలకు పూసిన పూలు ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా, కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయి. ఇక ఆకుపచ్చని మొక్కలు కుటుంబ సభ్యులకు ప్రశాంతమైన నిద్రని ఇస్తాయి. ఆ కుటుంబంలో సంతోషాన్ని మేల్కొల్పుతాయి.

జీవితంలోకి సానుకూల శక్తి ప్రవహించేలా.. జాగ్రత్త అవసరం
అందుకే ఇల్లు, ఇంట్లోని గదులు మాత్రమే కాకుండా టెర్రస్ విషయంలో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. టెర్రస్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే దాని ప్రభావం కూడా ఆయా కుటుంబ కుటుంబ సభ్యుల జీవితం పైన కచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి టెర్రస్ పైన చెత్తాచెదారాన్ని తీసేసి, అందమైన మొక్కలతో.. ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్కలతో మీ జీవితంలోకి సానుకూల శక్తి ప్రవహించేలా, సంతోషంగా జీవించేలా మార్చుకోండి. ఇది మీ జీవితానికి అదృష్టాన్ని, ధనాన్ని తెచ్చి పెడుతుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
జూన్ లో బృహస్పతి దయతో నక్కతోక తొక్కే రాశులు ఇవే! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
వాస్తు ప్రకారం ఇంట్లో చపాతీలను లెక్కపెట్టి చేస్తే పరమ దరిద్రం -
మిథున రాశి, కర్కాటక రాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
నవ పంచమ రాజయోగంతో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే?












Click it and Unblock the Notifications