డబ్బు సమస్యలా? వంటగదిలో వీటిని బోర్లా పెట్టకండి; వీటిని బయట పడెయ్యండి!!
ఎంత కష్టపడి పని చేసిన ఫలితం లేకపోవడం, తరచూ చిరాకులు, ఎప్పుడూ సమస్యలతో సతమతమవుతూ ఉండటం, అన్ని వైపుల నుంచి నిరాశ ఎదుర్కోవడం వంటి పరిణామాలు ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే కలుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎప్పుడూ సమస్యలతో సతమతమయ్యేవారు సమస్యల బారి నుండి బయటపడడం కోసం కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలి అని, ముఖ్యంగా వంటగది విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వంట గదికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లో సమస్యలకు, ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని కష్టాలకు వంటగది వాస్తు దోషాలు కూడా ఒక్కోసారి కారణంగా మారుతాయి. వంట గదిలో అన్నపూర్ణాదేవి నివాసం ఉంటుంది. అందుకే కిచెన్లో పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఉంచుకోకూడదు. కొన్ని వస్తువులను బోర్లా పెట్టకూడదు. ఇక ఆ వస్తువులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం కిచెన్లో చీపుర్లు పెట్టకూడదు. చీపురును లక్ష్మీదేవి సంకేతంగా చెబుతారు. అటువంటి చీపురును వంట గదిలో పొరపాటున కూడా ఉంచకూడదని, ఒకవేళ చీపురు వంటగదిలో ఉంటే చిరాకులు తప్పవని చెబుతున్నారు చీపురు వంటగదిలో ఉండటంవల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం పాడవుతుంది. అన్నపూర్ణ దేవికి కూడా ఆగ్రహం వస్తుందని చెబుతున్నారు.
ఇక వాస్తు శాస్త్రం ప్రకారం చాలా మంది విరిగి పోయిన గిన్నెలు, ప్లేట్లను ఇళ్లలోనే పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ఇలా విరిగి పోయిన గిన్నెలు, గ్లాసులు, ప్లేట్లు ఇంట్లో ఉంచుకోవడం వల్ల చిరాకులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని చెబుతున్నారు.
ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉపయోగించే బాణలిని కాని, దోశ పెనం కానీ పొరపాటున కూడా బోర్లా పెట్టకూడదు. ఇలా బోర్లా పెడితే ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయి అని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం కిచెన్లో అద్దం ఉండకూడదు. ఎవరైనా కిచెన్లో అద్దం పెట్టుకుంటే అగ్నిదేవుడు ఎనర్జీ రెట్టింపవుతుంది.
దీనివల్ల అవసరానికి మించిన ఎనర్జీతో హాని కలుగుతుంది. నెగిటివ్ శక్తులకు ఇది కారణమౌతుంది. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం కిచెన్ లో అద్దాలు, విరిగిపోయిన, పగిలిపోయిన గిన్నెలు, గ్లాసులు, చీపుర్లు పెట్టడం మంచిది కాదని చెబుతున్నారు. వీటిని బయట పడేస్తే సమస్యల నుండి విముక్తి లభిస్తుందని అంటున్నారు.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
వాస్తు ప్రకారం మెయిన్ ఎంట్రన్స్ దక్షిణం, ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం ఉంటే ఏం చేయాలి? -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
ఉగాది నుండి వీరికి ధనయోగం.. బిజినెస్ అద్భుతం.. వృషభరాశి జాతకమిలా! -
today rashiphalalu: నేడు బృహస్పతి, బుధుల స్థానాలలో మార్పు.. వీరికి జాక్ పాట్! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
మీన, కుంభ రాశులలో ముఖ్య గ్రహాలు.. వీరికి నేడు డబ్బులే డబ్బులు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్!












Click it and Unblock the Notifications