vastu tips: ఉద్యోగంలో ఒత్తిడి తప్ప పురోగతి లేదా? అయితే ఈ వాస్తుటిప్స్ మీకోసమే !!
చాలా మంచి ఉద్యోగం విషయంలో పురోగతి లేక తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటారు.ఎంత కష్టపడి పని చేసిన అందుకు తగిన ఫలితం లేక రాక, ప్రమోషన్లు రాక బాధపడుతూ ఉంటారు. పని చేసేదగ్గర తీవ్ర ఒత్తిడి ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి వారు చిన్నచిన్న వాస్తు పరిహారాలు పాటిస్తే మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.
ఉద్యోగం లేదా కెరీర్లో మంచి పురోగతి సాధించాలంటే వ్యక్తి జాతకంలో పదవ ఇంటికి అధిపతి లాభదాయకంగా ఉండాలి. అలా కాకుండా అక్కడ ఏదైనా దుష్ట గ్రహం కూర్చుంటే ఉద్యోగం లాభదాయకంగా ఉండకపోగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు జాతకంలో బుధ మరియు శని గ్రహాలు సానుకూల ఫలితాలను కలిగించే స్థానంలో లేకపోతే కూడా ఉద్యోగంలో ఉన్నత స్థానం లభించదు.

ఇక అటువంటి వారి ఉద్యోగంలో పురోగతి కోసం కొన్ని వాస్తు నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఉద్యోగంలో పురోగతి కోసం ఉత్తరం అభిముఖంగా గానీ, ఈశాన్యం ముఖంగా గానీ కూర్చుంటే మంచిదని చెబుతున్నారు. ఉద్యోగంలో వేగంగా అభివృద్ధి లభించాలంటే కూర్చునే దిశ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
ఉత్తరంలో కానీ ఈశాన్యంలో కానీ ఏదైనా నీటి ప్రవాహానికి సంబంధించిన ఫోటో పెట్టుకుంటే ఉద్యోగంలో వేగంగా పురోగతి ఉంటుందని చెబుతున్నారు. ఇక ఆఫీసులో లోహపు కుర్చీ కన్నా, చెక్క కుర్చీలో కూర్చుంటే మంచిదని, ఇక కుర్చీ వెనక వైపు ఎత్తుగా ఉంటే మంచిదని ఎన్ని వాస్తు దోషాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు.

అంతే కాదు ఉద్యోగం చేసేవారు వారు కూర్చునే గదిలో ఉత్తరం వైపున గానీ తూర్పు వైపున గానీ తలుపులు లేదా కిటికీలు కానీ ఉంటే వారికి అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుందని, త్వరగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఉద్యోగం చేసేవారు వారి గదిలోపల, లేదా వారు పనిచేసే టేబుల్ పైన చెత్త చెదారం లేకుండా చూసుకోవాలని, నీట్ గా సర్ది పెట్టుకోవాలని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications