vastu tips: శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే తెలుసుకోవాల్సిన నియమాలివే!!
శుక్రవారం రోజు చాలామంది లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడినటువంటి రోజు. ఎవరైతే శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారో.. ఆమెకు ఇష్టమైన కొన్ని పనులు చేస్తారో వారిపై లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఉంటుంది. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడంతోపాటు శుక్ర గ్రహాన్ని కూడా పూజిస్తారు. ఇది కెరీర్, వ్యాపారం మరియు ప్రేమ సంబంధాలలో విజయాన్నిస్తుంది.
శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని చాలామంది ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే చాలామంది ఇంట్లో సంతోషం, శ్రేయస్సు మరియు సంపద కోసం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని విధిగా పూజిస్తారు. అయితే లక్ష్మీదేవి కొంతమంది ఇళ్లలోనే నివసిస్తుందని, అటువంటివారు లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని పనులు చేస్తారని చెబుతున్నారు. అసలు లక్ష్మీదేవి నివాసం ఉండాలి అంటే ఆ ఇల్లు ఏ విధంగా ఉండాలి వంటి వివరాలను ఇక్కడ మనం తెలుసుకుందాం.

కష్టపడి పని చేసే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని చెబుతారు. కష్టపడి ఆహారాన్ని పొదుపు చేసే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బద్దకాన్ని వదిలిపెట్టి కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి వారి ఇంటికి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుంది. శుక్రవారం నాడు మీరు లక్ష్మీ దేవికి ఎన్ని పూజలు చేసినా కుటుంబ కలహాలు ఉన్న ఇంట్లో, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు. ఒకవేళ లక్ష్మీదేవి వచ్చిన ఇంట్లో నెగిటివ్ రిజల్ట్స్ కనపడితే వెంటనే వెళ్ళిపోతుంది. దీనివల్ల వైవాహిక జీవితంలో ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలు ఎదురవుతాయి.
అందుకే ఎప్పుడూ ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులందరూ ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలను కలిగి ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుంది. ఇక అంతే కాదు చెప్పింది అర్థం చేసుకోని మూర్ఖులు, వెన్నుపోటుదారులు ఉన్న ఇంట్లో లక్ష్మీ ఒక్క క్షణం కూడా ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే వారి మనసు స్వచ్ఛంగా ఉండాలి. మూర్ఖులు, వెన్నుపోటుదారులకు మంచివారు దూరంగా ఉండాలని చెబుతున్నారు. మొత్తంగా చెప్పాలంటే లక్ష్మీదేవి కటాక్షం కావాలనుకునేవారు నిజాయితీగా కష్టపడే వారై ఉండాలని చెబుతున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications