vastu tips:ఈ ఐదు చెడు అలవాట్లు ఇంటికి దరిద్రాన్ని తెస్తాయి.. మార్చుకోండి!!

మనం తెలిసో తెలియకో కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అయితే మనం చేసే పనులు కొన్ని మనకు మంచిని చేస్తే, కొన్ని పనులు మనకు చెడు చేస్తాయి. ఇంట్లో సుఖంగా సంతోషంగా జీవితం గడపాలంటే ఇంటికి వాస్తు ఉండడంతో పాటు, ఇంట్లో ఎక్కడ వస్తువులు ఏ విధంగా పెట్టుకోవాలి అన్నది తెలిసి ఉండాలి. అంతేకాదు కొన్ని చెడ్డ అలవాట్లకు కూడా మనం దూరంగా ఉండాలి.

మనకు తెలిసి తెలియక అలవాటులో పొరపాటుగా చేసే కొన్ని తప్పు పనులు మన జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక మనం మార్చుకోవాల్సిన 5 చెడ్డ అలవాట్లు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ప్రతి వ్యక్తికి ఏవో కొన్ని అలవాట్లు ఉంటాయి. అవి వారి జీవితంపై కొన్నిసార్లు అనుకూల ప్రభావాలను కొన్నిసార్లు ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి.

Vastu tips

కొన్ని పనులు గ్రహాలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాయి. మంచి పనులు మనకు గౌరవాన్ని, సమాజంలో ప్రతిష్టను తెచ్చిపెడితే, చెడు అలవాట్లు రకరకాల సమస్యలకు కారణమై దురదృష్టానికి దారితీస్తాయి. ఇక అటువంటి చెడ్డ అలవాట్లలో నేలను గుద్దుకుంటూ నడవడం ఒకటి. కొంతమంది నేలపై బలంగా కాళ్ళను కొడుతున్నట్టుగా నడుస్తూ ఉంటారు. అలా నడవడం వల్ల వారి వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు చోటు చేసుకునే ప్రమాదం ఉంది.

కొంతమంది వంటగదిలో పాత్రలు ఎక్కడపడితే అక్కడ పడేస్తూ శుభ్రత లేకుండా ఉంటారు. ఈ అలవాటు మంచిది కాదు. ఇది ఆర్థిక ఇబ్బందులను కలిగించి పేదరికం తెచ్చిపెడుతుంది. చాలామందికి రోడ్డుపై ఉమ్మి వేసే అలవాటు ఉంటుంది. రోడ్డుపై ఉమ్మి వేసే వారి జీవితంపై చంద్రుడు, శుక్రుడు ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తారు . దీంతో వారు ఎప్పుడూ ఆర్థిక నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.

తిన్న తర్వాత చాలామంది ఎంగిలి గిన్నెలను అలాగే వదిలేసి పడుకుంటారు అలా ఎంగిలి గిన్నెలు వదిలేస్తే చంద్రుడికి, శనికి కోపం వస్తుంది. ఇక చాలా మందికి గోళ్ళు కొరికే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు వల్ల వాళ్ళ జాతకంలో సూర్యుడు బలహీనమై ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాడు. ఈ చెడు అలవాట్ల వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, అనేక కష్టాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+