Vastu tips: ఆర్ధికనష్టాల నివారణకు స్నానం చేసిన తర్వాత చేయకూడని పనులివే!!

చాలామంది స్నానం చేసిన తర్వాత తెలియక చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. అవి ఇంటికి దరిద్రం తీసుకువస్తాయి. ఇంటి ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి. స్నానం చేసిన తర్వాత కొన్ని నియమాలను పాటించటం తప్పనిసరి అని వాస్తు శాస్త్రం చెబుతోంది. అసలు స్నానం చేసిన తర్వాత పాటించవలసిన నియమాలు ఏమిటి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

బాత్రూమ్ అనేది ఇంట్లో ప్రతికూలతను సృష్టించే ప్రదేశం. కాబట్టి బాత్రూమ్ విషయంలో వాస్తు నియమాలను పాటించడం అవసరం. బాత్రూమ్ నుండి వచ్చే ప్రతికూలతలు నివారించడానికి కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను అనుసరించాల్సిందే అవసరం ఉంది. చాలామంది స్నానం చేసిన తర్వాత బకెట్లో నీళ్లను వదిలిపెట్టి వస్తూ ఉంటారు. అలా బకెట్లో నీళ్లను వదిలి పెట్టకూడదు.ఆ మిగిలిన నీటితో ఎవరైనా స్నానం చేస్తే అది ఆ వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతుంది.

Vastu tips: Things not to do after bathing to prevent financial losses!!

వాస్తు ప్రకారం ఎప్పుడు శుభ్రమైన నీటిని బకెట్లో నింపాలి. బకెట్ లో నీళ్ళు ఉంచనపుడు దానిని బోర్లించి పెట్టండి. దీనివల్ల ఎటువంటి వాస్తుదోషం రాదు. వివాహమైన స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత జుట్టు తడిగా ఉంటే కుంకుమ పెట్టుకోకండి. జుట్టు ఆరిన తర్వాతనే కుంకుమను పెట్టుకోండి.స్నానం చేసి జుట్టును అలాగే వదిలేస్తే జుట్టులోకి చాలా త్వరగా ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. కాబట్టి, ఈ విషయం గుర్తుంచుకోవాలి.

స్నానానికి ముందు నెయిల్ కట్టర్ వాడకూడదు. స్నానం చేసిన తర్వాత పదునైన వస్తువులు వాడకూడదు.స్నానం చేసిన వెంటనే స్టవ్ దగ్గరకు, మంటల దగ్గరకు వెళ్ళకూడదు. మొదట ఏదైనా తిన్న తర్వాత వంటగదిలోకి ప్రవేశించండి. స్నానం చేసిన తర్వాత వెంటనే మేకప్ వెయ్యకూడదు. తడిబట్టలు ఉతకకుండా ఉంచకండి.

స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ తడిగా ఉంచకండి. బాత్రూమ్ అపరిశుభ్రంగా ఉంచవద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడుతుంది. స్నానం చేసిన వెంటనే బాత్‌రూమ్‌ని శుభ్రం చేయకుంటే రాహు, కేతు, శని గ్రహాలు చికాకు పడతాయి.దీని వల్ల ఈ మూడు గ్రహాల దుష్ఫలితాలు వేగంగా పెరుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+