వాస్తు అంటే ఏమిటి? ఎన్ని రకాలుంటాయి? ఎందుకు అనుసరించాలి?
ఏ నిర్మాణమైనా వాస్తు ప్రకారం నిర్మించుకుంటే దానికి సంబంధించిన యజమాని, కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో జీవిస్తారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. మన పెద్దలు పురాతన కాలం నుంచే దీన్ని అనుసరిస్తున్నారు. సృష్టి ప్రారంభమైనప్పటి నుంచే మనకు వాస్తు శాస్త్రం అందుబాటులో ఉంది. వాస్తు అంటే మనం నివసించే ప్రదేశం అని అర్థం. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం... పంచభూతాలను సమతుల్యం చేస్తూ, ప్రకృతి శక్తులకు అనుగుణంగా భవనాలను నిర్మించే విధానమే వాస్తు శాస్త్రం. ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే అనుకునేరు. అందులో గాలి, వెలుతురు, అయస్కాంత శక్తులు, భూమి భ్రమణం వంటి వైజ్ఞానిక అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి.
ప్రాచీన గ్రంథాల ప్రకారం వాస్తును నాలుగు విభాగాలుగా విభజించారు
భూమి వాస్తు, హర్మ్య వాస్తు, శయనాసన వాస్తు, యాన వాస్తు అంటారు.

భూమి వాస్తు అన్నిటికంటే పునాది వంటిది.
మనం ఇల్లు కట్టుకోవడానికి ఎంచుకున్న స్థలం ఆకారం,
నేల స్వభావం, వాలు, మట్టి నాణ్యతను తెలియజేస్తుంది.
హర్మ్య వాస్తు స్థలంలో నిర్మించే ఇంటికి సంబంధించినది.
గదుల అమరిక, ద్వారాలు, కిటికీలు, పైకప్పు ఎత్తు వంటి అంశాలు దీని కిందకు వస్తాయి.
శయనాసన వాస్తు ఇంట్లో మనం ఉపయోగించే వస్తువుల అమరికను తెలియజేస్తుంది.
మంచాలు, కుర్చీలు, బీరువాలు, ఇతర ఫర్నిచర్ ఎక్కడ ఉండాలో ఇది నిర్దేశిస్తుంది.
యాన వాస్తు పూర్వకాలంలో రథాలు, పడవలు వంటి వాహనాల తయారీకి వాడేవారు.
ప్రస్తుతం మనం వాడే వాహనాలను ఎక్కడ పార్క్ చేయాలి, ఏ దిశలో ఉంచాలి అనే అంశాలను
ఈ వాస్తు ద్వారా తెలుసుకోవచ్చు.
దిక్కులు - అధిదేవతలు
వాస్తు శాస్త్రం ఎనిమిది దిక్కులకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఒక్కో దిశకు ఒక్కో అధిదేవత ఉంటారు
తూర్పునకు ఇంద్రుడు ఉంటాడు. ఆరోగ్యం, ఐశ్వర్యం ఇస్తాడు.
పడమరకు వరుణుడు ఉంటాడు. లాభం, పేరు ప్రఖ్యాతులిస్తాడు.
ఉత్తరంకు కుబేరుడు ఉంటాడు. ధనం, సంపద ఇస్తాడు.
దక్షిణంకు యముడు ఉంటాడు. స్థిరత్వం, ఆయుష్షు ఇస్తాడు.
ఈశాన్యంకు ఈశ్వరుడు ఉంటాడు. ఆధ్యాత్మికత, జ్ఞానం ఇస్తాడు.
ఆగ్నేయంకు అగ్ని దేవుడు ఉంటాడు. శక్తి, ఆరోగ్యం ఇస్తాడు.
నైరుతి నివృత్తి బరువు ఉంటాడు. అధికారం ఇస్తాడు.
వాయువ్యంకు వాయు దేవుడు ఉంటాడు. గమనశీలత కలిగిస్తాడు.
ఈశాన్యం ఖాళీగా, తేలికగా, శుభ్రంగా ఉండాలి.
ఇక్కడ బావి లేదా బోర్ వేయడం శుభప్రదం.
నైరుతి దిశలో బరువు ఎక్కువగా ఉండాలి.
ఇంటి యజమాని పడకగది ఇక్కడ ఉండటం వల్ల ఇంట్లో క్రమశిక్షణ ఉంటుంది.
ఆగ్నేయం దిక్కు వంటగదికి సరైన స్థానం.
ఇక్కడ నీటి నిల్వ ఉండకూడదు.
బ్రహ్మస్థానం అంటే ఇంటి మధ్య భాగం. ఇది ఖాళీగా ఉండాలి.
అక్కడ ఎటువంటి బరువైన నిర్మాణాలు చేయకూడదు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
వాస్తు ప్రకారం ఇంట్లో చపాతీలను లెక్కపెట్టి చేస్తే పరమ దరిద్రం -
మిథున రాశి, కర్కాటక రాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
నవ పంచమ రాజయోగంతో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..












Click it and Unblock the Notifications