2025లో నక్కతోక తొక్కే రాశులు ఇవే.. శాసనం చేసిన శుక్ర, రాహువులు!

జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శుక్రుడు సంపదలకు, విలాసాలకు అధిపతిగా చెబుతారు. ఇక రాహువును క్రూర గ్రహంగాను, చెడు చేసే గ్రహంగాను చెబుతారు. అయితే శుక్రుడు, రాహువు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు జరిగే యుతి కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మొత్తంగా గ్రహాలు చేసే సంచారం ,వాటి సంయోగం ద్వాదశ రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తాయి.

శుక్ర రాహువుల సంయోగం
2025 జనవరి 28వ తేదీన శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇక రాహు గ్రహం ఇప్పటికే చతుష్టయంలో ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో రెండు గ్రహాల సంయోగం మీనరాశిలో జరగబోతుంది.రాహువు, శుక్రుడు మీనరాశిలో సంయోగం చెందడం వల్ల మూడు రాశుల వారి అదృష్టం మామూలుగా ఉండదు. ఈ రాశుల వారు నక్క తోకను తొక్కినట్టే ఉంటుంది.

Venus and rahu conjunction in pisces in 2025 january these zodica signs will get wealth

కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు శుక్రుడు రాహువు యొక్క యుతి కారణంగా శుభాలు జరుగుతాయి. కర్కాటక రాశి వారికి తల్లిదండ్రులతో సత్సంబంధాలు పెరుగుతాయి. ఈ సమయంలో వీరు భారీ ఆర్థిక లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు దక్కించుకుంటారు. వీరు కనే కలలు నెరవేరుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

తులారాశి
శుక్రుడు రాహువు యొక్క సంయోగం కారణంగా తులా రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు పని పట్ల సంతోషంగా ఉంటారు. ఉద్యోగాలు చేసే వారికి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు వస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి పెళ్లయిన వారు వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతారు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి శుక్రుడు రాహువు యొక్క కలయిక చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వారు చేసే ప్రతి పనిలోనూ విజయాలను సాధిస్తారు . పోటీ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు విజయ అవకాశాలు కలుగుతాయి. చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. ఇది వృశ్చిక రాశి వారికి అదృష్ట సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+