నవంబర్ 7వరకు వీరికి కుబేరయోగం ప్రకటించిన శుక్రుడు!
అక్టోబర్ 13వ తేదీన శుక్రుడు తులారాశి నుండి వృశ్చిక రాశిలోకి సంచారం చేశాడు. శుక్రుడు నవంబర్ 7వ తేదీ వరకు వృశ్చిక రాశిలో సంచరించనున్నాడు. ఈ శుక్ర సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. శుక్ర సంచారంతో లబ్ధిని పొందుతున్న ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
వృషభ రాశి
వృశ్చిక రాశిలో శుక్ర సంచారం కారణంగా వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వృషభ రాశి జాతకులు మంచి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. షేర్లు, వడ్డీ వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. వృషభ రాశి వారికి ఈ సమయంలో వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి శుక్ర సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారు ఏ పని చేసిన విజయం వరిస్తుంది. కర్కాటక రాశి వారి ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. వివాహం చేసుకున్న వారికి సంతానయోగం కలుగుతుంది. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో సొంత పనుల పైన దృష్టి పెడితే మంచి జరుగుతుంది.
సింహరాశి
శుక్ర సంచారం కారణంగా సింహరాశి వారి జీవన విధానం లో సానుకుల మార్పులు వస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం ప్రశాంతంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి పురోగతి ఉంటుంది. ఆదాయ వనరులు భారీగా పెరుగుతాయి. వైవాహిక జీవితంలో అనుబంధాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది.
తులారాశి
తులారాశి వారికి శుక్ర సంచారం కలిసి వస్తుంది. తులారాశి జాతకులు అనుభవించే ఆర్థిక సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. సంపద వృద్ధితోపాటు ఈ సమయంలో సంతోషంగా జీవించే అవకాశం ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి శుక్ర సంచారం కలిసొస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి జాతకులు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఉంటే తొలగిపోతాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
మకర రాశి
మకర రాశి వారు శుక్ర గోచారంతో ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో మకర రాశి వారి వైవాహిక జీవితం శుభప్రదంగా ఉంటుంది.. మకర రాశి వారి ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. ఇది మకర రాశి వారికి అదృష్ట సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications