మాలవ్య రాజయోగంతో వీరి ఇంటికి లక్ష్మీదేవిని పంపిస్తున్న శుక్రుడు

సెప్టెంబర్ నెలలో విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు తన సొంత రాశి అయిన తులా రాశిలో సంచరించబోతున్నాడు. తులా రాశిలో శుక్ర సంచారం ఎంతో శుభప్రదమైన మాలవ్య రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తే, మరికొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని కూడా ఇస్తుంది. మాలవ్య రాజయోగంతో లబ్ధిని పొందే రాశులు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

తులారాశిలో శుక్ర సంచారంతో మాలవ్య రాజయోగం
ఆగస్టు 25వ తేదీన శుక్రుడు సింహరాశి నుండి కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తరువాత శుక్రుడు తన సొంతరాశి అయిన తులారాశిలోకి అడుగుపెడతాడు. సెప్టెంబర్ 18వ తేదీన సిరిసంపదలను చేకూర్చే శుక్రుడు తులారాశిలోకి అడుగుపెట్టిన సమయంలో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది . దాదాపు సంవత్సరం తర్వాత శుక్రుడు తులారాశిలో మాలవ్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. మాలవ్య రాజయోగాన్ని పంచ మహాపురుష యోగాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ యోగంతో డబ్బుకు లోటు ఉండదు.

Venus brings Malavya rajyoga in September in libra these zodiac signs will get huge wealth

తులారాశి
మాలవ్య రాజయోగం వల్ల తులా రాశి వారికి అదృష్టం ప్రకాశిస్తుంది. మాలవ్య రాజయోగంతో తులారాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన విజయం వరిస్తుంది. ఆర్థికంగా తులా రాశి వారికి కలిసొస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

కుంభరాశి
మాలవ్య రాజయోగం కారణంగా కుంభరాశి జాతకుల అదృష్టం మెరుస్తుంది. ఈ సమయంలో కుంభరాశి జాతకుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది .విదేశాలలో చదువుకోవాలనే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. కెరీర్లో గొప్ప విజయాలను సాధిస్తారు .ఈ సమయంలో కుంభరాశి జాతకులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు.

మీన రాశి
మాలవ్య రాజయోగం వల్ల మీన రాశి జాతకులకు ఊహించని ఆర్థిక లబ్ధి జరుగుతుంది. మీనరాశి జాతకులు ఈ సమయంలో ఉద్యోగ వ్యాపారాలలో గణనీయమైన పురోగతిని సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో ప్రేమ సంబంధాలు మధురానుభూతులను మిగులుస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఈ సమయంలో మీనరాశి జాతకులు సంతోషంగా జీవిస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+