త్వరలో ప్రత్యక్ష శుక్రుడు... వీరికి ఐశ్వర్య యోగాన్ని రాసిచ్చాడు
జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని విలాసాలకు అధిపతిగా భావిస్తారు. శుక్రుడు సంతోషానికి, ఐశ్వర్యానికి, ఆస్తులకు కారకుడిగా పరిగణిస్తారు. శుక్రుడి సంచారం అన్ని రాశుల వారి జీవితాల పైన కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. శుక్రుడి రాశి సంచారం ,నక్షత్ర సంచారం, శుక్ర గమనంలో వచ్చే మార్పులు కూడా అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తాయి.
శుక్రుడి ప్రత్యక్ష సంచారం
ప్రస్తుతం ఏప్రిల్ నెలలో శుక్రుడి ప్రత్యక్ష గమనం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ప్రస్తుతం శుక్రుడు వక్ర గమనంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడి తిరోగమన సంచారం మార్చి రెండవ తేదీన మీనరాశిలో మొదలైంది. అయితే ఏప్రిల్ నెలలో 13వ తేదీన శుక్రవారం మళ్లీ ప్రత్యక్ష సంచారం చేస్తాడు. శుక్ర ప్రత్యక్ష సంచారం వల్ల అదృష్టం పొందే రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధున రాశి
మిధున రాశి వారికి శుక్రుడి ప్రత్యక్ష సంచారం వల్ల కలిసి వస్తుంది .మిధున రాశిలో ఉద్యోగ ,వ్యాపారాలను ప్రభావితం చేసే స్థానంలో ప్రత్యక్షంగా శుక్రుడు సంచరిస్తాడు. దీనివల్ల వీరికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మిధున రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ప్రేమ జీవితంలో మార్పులు వస్తాయి. ఉద్యోగంలో మార్పులకు అవకాశం ఉంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు.
కన్యారాశి
కన్యా రాశి వారికి శుక్రుడి ప్రత్యక్ష సంచారం వల్ల లాభాలు చేకూరుతాయి. శుక్రుడి ప్రత్యక్ష సంచారం వీరి దాంపత్య జీవితాన్ని సంతోషంగా మారుస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి కన్యారాశి జాతకులు సంతోషంగా ఉంటారు. ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. మీరు ప్రముఖుల ఆశీర్వాదాలను పొందుతారు. వ్యాపారాలలో విజయాలను సాధిస్తారు.
కుంభరాశి
శుక్రుడి ప్రత్యక్ష సంచారం కారణంగా కుంభరాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో కుంభ రాశి వారు ఊహించని ఘన లాభాలను పొందుతారు. శుక్రుడు కుంభరాశిలో ఆర్థిక అంశాల స్థానంలో సంచరించడం వల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారి ఆర్థిక స్థితి బలపడుతుంది. ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. పని ప్రదేశంలో మీరు మీ నైపుణ్యాలను ప్రదర్శించవచ్చు . ఉద్యోగంలో మార్పులు సంభవిస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications