మార్చి నెలలో ఈ రాశులకు కష్టాలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్న శుక్రుడు!

వేద జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గ్రహాలలో రాక్షస గురువుగా భావించే శుక్రాచార్యుడికి ముఖ్యమైన స్థానం ఉంది. శుక్రుడు సంపదలకు, విలాసాలకు అధిపతి ఎవరి జీవితంలో అయితే శుక్రుడు ఉన్నత స్థానంలో ఉంటాడు. వారి జీవితం లగ్జరీలతో తులతూగుతుంది.

శుక్ర తిరోగమనం
శుక్రుడు తన రాశిచక్రాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ, అప్పుడప్పుడు వక్ర స్థితిలో ప్రయాణం చేస్తుంటాడు. శుక్రుని స్థితిలో మార్పు వచ్చినప్పుడు దాని ప్రభావం అన్ని రాశులవారి పైన పడుతుంది. శుక్రుడు మార్చి రెండవ తేదీన మీనరాశిలో తిరోగమనం చెందుతున్నాడు. మీనరాశిలో శుక్రుడు తిరోగమన సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శుక్ర సంచారం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన ఆ రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

Venus gives huge problems to these zodiac signs from march

మిధున రాశి
శుక్రుడు మిధున రాశిలో పదవ స్థానంలో తిరోగమనంలో ఉంటాడు. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు జీవితంలోని అనేక రంగాలలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక ప్రేమ జీవితంలో మీరు సమస్యలను ఎదుర్కొంటారు. ఆదాయం తగ్గుతుంది. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. వ్యాపారుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. మిధున రాశి జాతకులకు శుక్ర సంచారం ఇబ్బందులను తెచ్చిపెడుతుంది.

కర్కాటక రాశి
శుక్రుడు కర్కాటక రాశిలోని తొమ్మిదవ స్థానంలో తిరోగమనం చెందుతాడు. దీంతో కర్కాటక రాశికి చెందిన వ్యక్తుల బడ్జెట్ ప్రభావితం అవుతుంది. కర్కాటక రాశి వారు ఈ సమయంలో ఊహించని ఖర్చులను ఎదుర్కొంటారు. ఉద్యోగంలో పనిచేసే చోట ఉన్నతాధికారులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కర్కాటక రాశి వారు చాలా ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది.

సింహరాశి
సింహ రాశి వారికి ఎనిమిదవ స్థానంలో శుక్రుడు తిరోగమన సంచారం చేస్తాడు. దీంతో సింహరాశి జాతకులకు అనేక కష్టాలు రాబోతున్నాయి. సింహరాశి జాతకులు ఉద్యోగం కోసం ఈ సమయంలో ఇబ్బందులు పడతారు. వృత్తిపరంగా అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థిక సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో గొడవలు జరగవచ్చు ..కానీ ఆస్తుల నుండి కొంత లాభం పొందే అవకాశం కూడా ఉంది.

కన్యారాశి
కన్య రాశిలో ఏడవ స్థానంలో శుక్రుడు తిరోగమనం చెందుతున్నాడు. కన్యా రాశి వారు ఈ సమయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. అది ప్రేమ జీవితమైనా, వివాహమైనా, స్నేహమైనా సరే ఈ సమయంలో కొంచెం కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+