ఈ రాశులవారికి ఆకస్మిక ధనలాభాలను, విలాసాలను ఇస్తున్న శుక్రుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి ఒక ప్రముఖమైన స్థానం ఉంది. శుక్రుడు లగ్జరీలకు అధిపతిగా పరిగణిస్తారు. ప్రతి 26 రోజుల నుంచి 28 రోజులకు ఒకసారి శుక్రుడు తన రాశి చక్రాన్ని మార్చుకొని సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు రాశులను మాత్రమే కాకుండా నక్షత్రాలను కూడా మార్చుకుంటూ సంచారం చేస్తాడు. ప్రస్తుతం సెప్టెంబర్ 13వరకు హస్తా నక్షత్రంలో శుక్ర సంచారం సాగుతుంది.
హస్తా నక్షత్రంలో శుక్రుడు
హస్తా నక్షత్రానికి చంద్రుడు అధిపతి. హస్తా నక్షత్రంలో శుక్ర సంచారం 12 రాశుల వారి జాతకాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని రాశుల వారి పైన అనుకూలమైన ప్రభావాలు చూపిస్తే, కొన్ని రాశులు ప్రతికూలంగా ప్రభావితం అవుతాయి. ప్రస్తుతం మనం హస్తా నక్షత్రంలో శుక్ర సంచారం వల్ల మరో రెండు రోజుల పాటు అదృష్టం వరిస్తున్న రాశులను గురించి తెలుసుకుందాం.

కన్యా రాశి
హస్తా నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా కన్యరాశి వారికి లబ్ధి జరుగుతుంది. కన్యరాశిలో లగ్న గృహంలో శుక్రుడు ఉండటం వల్ల కన్యరాశి జాతకులు ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో ఏ రంగంలో పనిచేసిన ఉన్నత విజయాలను సాధిస్తారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మల్టీ టాస్కింగ్ లోను కన్యా రాశి వారు సక్సెస్ అవుతారు. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది.
సింహరాశి
హస్తా నక్షత్రంలో శుక్ర సంచారం సింహ రాశి వారికి మంచి ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. సింహరాశి జాతకుల ఆర్థిక స్థితి బలపడుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కెరీర్ లోను ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. వ్యాపారాలు చేసేవారు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
మకర రాశి
హస్తా నక్షత్రంలో శుక్ర సంచారం మకర రాశి వారికి చాలా సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మకర రాశి జాతకులు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. వీరికి అదృష్టం కలిసి వస్తుంది. కెరీర్ లోను సానుకూల ఫలితాలను పొందుతారు. విదేశాలలో ఉద్యోగాలు చేయాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఆర్థిక స్థితి గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications