మీనరాశిలో శుక్రుడు: ఈ రాశులవారికి దురదృష్టం, తీవ్ర అనారోగ్యం.. జాగ్రత్త!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పు అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. మార్చి 31వ తేదీ సాయంత్రం వరకు శుక్రుడు కుంభరాశిలో ఉండి ఆపై మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మీనరాశిలో శుక్రుడు ఏప్రిల్ 24వ తేదీవరకు ఉంటాడు.అయితే శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి అనుకూల ఫలితాలు రాగా, మరికొన్ని రాశులవారిని దురదృష్టం వెంటాడుతుంది.
వారు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మరి ఆ రాశులేమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
మీనరాశిలో శుక్ర సంచారం వల్ల ముఖ్యంగా మిధునరాశి వారు జాగ్రత్త వహించాలి. మిధునరాశి వారికి ఈ సమయంలో ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. మిధునం యొక్క పాలక గ్రహం బుధుడు, శుక్రుడుతో బలమైన స్నేహపూర్వక సంబంధాన్ని కలిగి ఉండినప్పటికీ, ఈ సమయంలో శుక్ర సంచారం మంచిది కాదని స్థానికులకు శుభప్రదం కాదని చెబుతున్నారు.

మీన రాశిలో శుక్ర సంచారం వల్ల మిధున రాశి ఉద్యోగస్తులు కార్యాలయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో పనిలో జాగ్రత్తగా లేకుంటే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇక ప్రేమ సంబంధంలో కూడా హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి అంత లాభదాయకంగా ఉండదు. ఈ సమయంలో విజయ అవకాశాలు తక్కువగా ఉంటాయి.
మీనరాశిలో శుక్ర సంచారం వల్ల కుంభరాశి జాతకులను దురదృష్టం వెంటాడుతుంది. కుంభరాశి జాతకులు ఈ సమయంలో మాటలపై అదుపు ఉంచుకోవలసిన అవసరం ఉంది. మీనరాశిలో శుక్ర సంచారం కుంభరాశి జాతకుల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఈ సమయంలో అసమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం కుంభరాశి జాతకులు మానుకోవాలి. ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా వీరు జాగ్రత్తగా ఉండాలి. పంటి నొప్పి, గొంతు నొప్పి, నోటి పూత వంటి సమస్యలు ఆందోళన కలిగిస్తాయి.
మీనరాశిలో శుక్ర సంచారం వల్ల తులారాశి వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో వీరి ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఏ పని చేసినా వీరు మంచి ఫలితాలను సాధించలేరు. తులారాశి వ్యాపారులు మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రశాంతంగా పనిచేసే పరిస్థితి ఉండకపోవచ్చు.
ఈ సమయంలో తులా రాశి జాతకులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. డయాబెటిస్ తో బాధపడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. ఈ సమయంలో ఆస్తుల కొనుగోలు, పెట్టుబడులు పెట్టడం వంటి వాటికి దూరంగా ఉండండి. నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్న కారణంగా ఆర్థిక అంశాలలో అప్రమత్తత అవసరం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications