శుక్రుడు త్వరలో వీరికి డబ్బు సంచులను మోసుకొస్తున్నాడు!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశుల సంచారం, నక్షత్ర సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి మారడమే కాకుండా నక్షత్ర మార్పు కూడా చేస్తూ ఉంటాయి. అలా విలాసాలకు, సంపదలకు ప్రత్యేకంగా చెప్పబడే శుక్రుడు ఆగస్టు 11వ తేదీన పూర్వ ఫాల్గుణి నక్షత్రంలోనికి ప్రవేశించనున్నాడు.
పుబ్బ నక్షత్రంలోకి శుక్రుడు
పూర్వఫాల్గుణి నక్షత్రాన్నే పుబ్బ నక్షత్రం అని కూడా అంటారు. ఈ పుబ్బ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు తన సొంత నక్షత్రమైన పూర్వ ఫాల్గుణి నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మీన రాశి
పుబ్బ నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా మీన రాశి వారికి గణనీయమైన లాభాలు వస్తాయి. ఈ సమయంలో మీనరాశిలో శుక్రుడు ఏడవ ఇంట్లో ఉంటాడు. ఫలితంగా మీనరాశి జాతకుల పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పనిచేసే చోట గుర్తింపును పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీన రాశి వారి ఆదాయం మెరుగుపడుతుంది. డబ్బు ఆదా అవుతుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు.
ధనుస్సు రాశి
పుబ్బ నక్షత్రంలో శుక్ర సంచారం ధనస్సురాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో శుక్రుడు ధనుస్సురాశి యొక్క తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు. ఇది అదృష్ట గృహం కాబట్టి ఈ సమయంలో ధనుస్సు రాశి వారిపై శుక్రుడు దయ పుష్కలంగా ఉంటుంది. ఈ సమయంలో వర్తక వ్యాపారాలు లాభిస్తాయి. పెద్ద వ్యాపార ఒప్పందాన్ని చేసుకుంటారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.
తులారాశి
పుబ్బ నక్షత్రంలో శుక్ర సంచారం తులారాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. తులా రాశి వారు ఇప్పుడు నూతన ఉద్యోగ అవకాశాలను పొందే ఛాన్స్ ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి గణనీయమైన ప్రయోజనాలు వస్తాయి. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోయి తిరిగి సంతోషంగా కుటుంబంతో గడుపుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications