పూర్వాభాద్ర నక్షత్రంలో శుక్రసంచారం.. వీళ్ళు మట్టి ముట్టుకున్నా బంగారం!
విలాసాలకు, లగ్జరీలకు అధిపతి అయిన శుక్రుడు నిర్దిష్ట కాలం ప్రకారం తన రాశిని, నక్షత్రాన్ని మార్చుకుంటూ ఉంటాడు. శుక్ర సంచారం మొత్తం అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. రాక్షస గురువైన శుక్రుడికి జ్యోతిష్య శాస్త్రంలో మంచి గుర్తింపు ఉంది. ఇక శుక్రుడు తన రాశి పరివర్తన, నక్షత్ర పరివర్తన సమయంలో కొన్ని రాశుల వారి పైన ప్రత్యేకమైన కటాక్షాన్ని కలిగి ఉంటాడు.
పూర్వాభాద్ర నక్షత్రంలో శుక్రుడు
ప్రస్తుతం శుక్రుడు మీనరాశిలో ఉన్నాడు. ఏప్రిల్ ఒకటవ తేదీన ఉదయం 4:25 నిమిషాలకు శుక్రుడు పూర్వభాద్ర నక్షత్రం లోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు పూర్వాభాద్ర నక్షత్రంలో ఏప్రిల్ 26వ తేదీ వరకు ఉంటాడు. ఆపై ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తాడు. పూర్వభాద్ర నక్షత్రంలో శుక్ర సంచారం కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
శుక్రుడు నక్షత్ర సంచారం వృషభ రాశి వారి జాతకాలలో అనేక మార్పులకు కారణం అవుతుంది. ఈ సమయంలో వీరి కోరికలు తీరుతాయి. ఉద్యోగాలు లేని వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారం చేసే వారికి లాభాలు వస్తాయి. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు డబ్బులు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. ప్రేమ విషయాల్లో కూడా వీరికి సానుకూలంగా ఉంటుంది. వీరి వైవాహిక జీవితం మెరుగుపడుతుంది.
మకర రాశి
శుక్రుడి నక్షత్ర సంచారం మకర రాశి వారి జీవితాలలో గణనీయమైన ప్రభావాలను చూపిస్తుంది. మకర రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని అనుకున్న సానుకూలంగా పూర్తి చేస్తారు. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితంలో చోటుచేసుకుంటున్న ఇబ్బందులు పరిష్కరించబడతాయి. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు.
కుంభరాశి
శుక్రుడి నక్షత్ర మార్పు కుంభ రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కుంభరాశిలో ఉన్న విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. పోటీ పరీక్షలలో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. ఇంక్రిమెంట్లు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి .
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications