త్వరలో వీరికి అఖండ రాజయోగం, ఐశ్వర్యం ప్రకటించిన శుక్ర శని గ్రహాలు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శుక్రుడిని రాక్షసుల గురువుగా పిలుస్తారు. శుక్ర గ్రహం ప్రతి 28 రోజుల నుండి 30 రోజులకు ఒక రాశి నుండి మరొక రాశి లోకి రవాణా అవుతుంది. అయితే డిసెంబరు 28వ తేదీన శుక్రుడు రాత్రి 11 గంటల 28 నిమిషాలకు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు.

కుంభరాశిలో శుక్ర శని సంయోగం
ఇక అప్పటికే కుంభ రాశిలో శని దేవుడు ఉన్న నేపథ్యంలో కుంభరాశిలో శుక్ర శని సంయోగం జరుగుతుంది. ఈ సంయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా మూడు రాశులవారికి ఆర్ధికంగా కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Venus Saturn conjunct in Aquarius these zodiac signs will get wealth and Rajayoga

మకర రాశి
శని దేవుడు మకర రాశి యొక్క మొదటి మరియు రెండవ ఇంటికి అధిపతిగా ఉంటాడు. శని శుక్ర గ్రహాల కలయిక మకర రాశి వారికి అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది. మకర రాశి వారు కెరీర్ లో ఈ సమయంలో పురోగతి సాధించే అవకాశం ఉంది. నూతన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి.

ఆదాయం బాగా పెరుగుతుంది. ఈ సమయంలో మకర రాశి వారు డబ్బులను ఆదా చేయొచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ఇది సరైన సమయం. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అన్ని విధాలుగా మకర రాశి జాతకులకు ఇది అనుకూల సమయం.

తులారాశి
తులారాశి లోని అయిదవ ఇంట్లో శని మరియు శుక్ర సంయోగం జరుగుతుంది. ఇది తులా రాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో వీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉన్నత విద్యను ఆశించాలనుకునే విద్యార్థులకు ఇది సరైన సమయం .

కళా రంగంలో పనిచేసేవారు పురోగతి సాధిస్తారు. ఈ సమయంలో మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పూర్వీకుల నుండి ఆస్తి ప్రయోజనాలు కలిగే అవకాశం కూడా ఉంది. నూతన వాహనాలు ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. ఇది వీరికి నిజంగా కలిసొచ్చే కాలం.

వృషభ రాశి
వృషభ రాశిలో శని శుక్ర సంయోగం పదవ ఇంట్లో జరగబోతుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఇది అనుకూలమైన కాలం. వర్తక వ్యాపారాలు చేసేవారు అధిక లాభాలను పొందే అవకాశం ఉంది. వృషభ రాశి వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు ఇప్పుడు తిరిగి మీ చేతికి అందుతుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ఇది సరైన సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+