శుక్ర శనిదేవుల యుతి.. మార్చిలో ఈ రాశులవారికి సంపదల ప్రాప్తి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది మార్చి 2న సోమవారం అర్ధరాత్రి 1:01గంటలకు శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. మార్చి 26వ తేదీ వరకు ఇదే రాశిలో శుక్రుడి సంచారం కొనసాగనుంది. ఈ సమయంలో, మీనరాశిలోనే శనితో కలిసి శుక్రుడు ఒక శక్తివంతమైన సంయోగాన్ని ఏర్పరుస్తున్నాడు.దాదాపు 30సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఏర్పడుతున్న ఈ అరుదైన గ్రహ కలయిక, ద్వాదశ రాశులలో కొన్నింటికి విశేష ప్రయోజనాలను అందిస్తుందని జ్యోతిష్యనిపుణులు అంచనా వేస్తున్నారు.
శని, శుక్రుల యుతి
శని, శుక్రుల యుతి కారణంగా ఈ కాలంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం, వ్యాపార రంగంలో పురోగతి, పెండింగ్ పనుల పూర్తి జరుగుతుంది. మరియు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుదల వంటివి ఆశించవచ్చు. ఈ మాసం అంతా శని, శుక్రుడి ఈ ప్రభావవంతమైన కలయిక ఏయే రాశి వారికి సానుకూల ప్రభావాలను చూపుతుందో తెలుసుకుందాం.

వృషభ రాశి
శని-శుక్రుడి కలయిక వృషభ రాశి వారికి లాభ స్థానమైన పదకొండో ఇంట్లో జరుగుతుంది. దీని ప్రభావంతో వృషభ రాశి జాతకుల ఆర్థిక పరిస్థితి గణనీయంగా బలోపేతం అవుతుంది. కొత్త ఆదాయ వనరులు మీకు లభించే అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లు వస్తాయి, కెరీర్‌లో మంచి పురోగతి సాధిస్తారు.కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది, దాంపత్య జీవితం మరింత సామరస్యపూర్వకంగా సాగుతుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి శని-శుక్రుడి సంయోగం దశమ స్థానంలో జరగనుంది. దీనివల్ల మిధున రాశి జాతకులకు కెరీర్ పరంగా గొప్ప పురోగతి సాధించే అవకాశాలున్నాయి. మీ పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు కలిసివస్తాయి.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది.
తులా రాశి
తులా రాశి వారికి శుక్రుడు, శని కలయిక వారి జాతక చక్రంలోని ఆరో ఇంట్లో జరుగుతుంది. ఈ కారణంగా తులారాశి జాతకులు పలు సానుకూల ఫలితాలు పొందుతారు. ఈ కాలంలో చేపట్టే పెట్టుబడుల ద్వారా మంచి లాభాలను పొందుతారు. వ్యాపారాన్ని విస్తరించాలనే మీ ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయం గడపడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరుగుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి వారి జాతక చక్రంలో ఐదో ఇంట్లో శని-శుక్రుడి కలయిక సంభవిస్తుంది. దీని ప్రభావంతో వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. కెరీర్‌లో కొత్త దిశలో దూసుకుపోతారు. ఉద్యోగులకు ప్రమోషన్, జీతభత్యాల పెరుగుదల వంటి శుభవార్తలు వినిపిస్తాయి. వ్యాపారులకు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతాయి. వైవాహిక జీవితంలో సామరస్యం పెరుగుతుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications