మే నెలాఖరు వరకు వీరికే అఖండ ధనయోగం అంటున్న శుక్రుడు!
విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు జనవరి 28వ తేదీన ఉదయం ఏడు గంటల రెండు నిమిషాలకు శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు మీనరాశిలో మే 31వ తేదీ వరకు సంచారం చేస్తాడు. ఆపై శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక ఈ మధ్య కాలంలో శుక్రుడు మీనరాశిలో తిరోగమనం కూడా చెందుతాడు.
మీనరాశిలో శుక్ర సంచారం
ఇక మీనరాశిలో తిరోగమన శుక్రుడు మళ్ళీ ఏప్రిల్ 13వ తేదీన ప్రత్యక్ష రవాణా అవుతాడు. ఇక మీనరాశి లోకి ప్రవేశించిన శుక్రుడు మాలవ్య రాజయోగాన్ని ఏర్పరిచి శుభాలను కలిగించాడు. ఇక శుక్రుడు మీనరాశి సంచారం కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన లాభాలను తెచ్చిపెడుతుంది. మే 31వ తేదీ వరకు శుక్రుడి దయతో కలిసి వచ్చే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
మీనరాశిలో శుక్ర సంచారంతో వృషభ రాశి వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఉద్యోగాలు చేసేవారు మంచి విజయాలను సాధిస్తారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. వృషభ రాశి వారి సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి. ఈ సమయంలో వృషభ రాశి వారి ఆదాయం పెరుగుతుంది .
సింహరాశి
మీనరాశిలో శుక్ర సంచారం సింహ రాశి వారికి శుభాలను కలిగిస్తుంది. రానున్న రోజుల్లో సింహ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్దిక పరిస్థితి గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది. ఇది సింహరాశి వారికి శుభాలను చేకూర్చే సమయం. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. సింహరాశి వారి సొంత ఇంటి కల నెరవేరుతుంది.
కుంభరాశి
మీనరాశిలో శుక్ర సంచారంతో కుంభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాల విస్తరణకు కూడా ఇది మంచి సమయం. కుంభ రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. వేతనం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి.కుంభరాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications