శ్రావణ మాసంలో వీరికి సంపదలను, విలాసాలను ఖాయం చేసిన శుక్రుడు
గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి సంచారం చేస్తూ ఉంటాయి. వివిధ రాశుల లోనికి గ్రహాల మార్పు అన్ని రాశుల వారి జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఆగస్టు నెలలో కొన్ని గ్రహాలు రాశులను మార్పు చేస్తాయి. ముఖ్యంగా సంపదలకు,విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు ఆగస్టు నెలలో ఏకంగా నాలుగు సార్లు తన సంచారాన్ని మార్చుకోబోతున్నాడు.
ఆగస్టులో శుక్ర సంచారం
ఆగస్టు ఒకటవ తేదీన ఉదయం మూడు గంటల 51 నిమిషాలకు శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోకి ప్రవేశిస్తాడు. ఆపై ఆగస్టు 12వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల 14 నిమిషాలకు శుక్రుడు పునర్వసు నక్షత్రం లోకి, ఆపై ఆగస్టు 21న కర్కాటక రాశిలోకి, తదనంతరం ఆగస్టు 23న పుష్యమి నక్షత్రం లోకి శుక్ర సంచారం జరుగుతుంది.

ఈ రాశులవారికి ఆకస్మిక ధనలాభాలు
ఇలా ఆగస్టు నెలలో శుక్రుడు నాలుగు సార్లు రాశిని, నక్షత్రాలను మార్పు చేయడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. శ్రావణ మాసంలో వారు విశేష ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులు శుక్ర సంచారం కారణంగా శుభ ఫలితాలను పొందుతున్నారు. కర్కాటక రాశి వారికి శుక్ర సంచారం ప్రత్యేక లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ప్రేమించిన వ్యక్తి నుండి ప్రపోజల్ వచ్చే అవకాశం ఉంది. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.
కన్యారాశి
కన్య రాశి వారికి శుక్ర సంచారం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి ఈ సమయంలోఅదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగులకు ఇది చాలా మంచి సమయం. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కెరీర్ మరియు వ్యాపారంలో కూడా అభివృద్ధి ఉంటుంది. అదనపు ప్రాజెక్టుల ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి.
మకర రాశి
మకర రాశి వారికి ఆగస్టు నెలలో శుక్రుడు నాలుగు సార్లు రాశి మారడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. మకర రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మకర రాశి జాతకులు కెరీర్ మరియు వ్యాపారంలో కూడా విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆస్తులకు సంబంధించిన విషయాల్లో చేసే పనులు లాభదాయకంగా ఉంటాయి.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications