కర్కాటక రాశిలోకి శుక్రుడు: అదృష్టమంటే ఈ రాశుల వారిదే!!

ఆగస్టు నెలలో శుక్రుడు కర్కాటక రాశిలోకి వెళ్లి, తిరోగమనం చెంది, ఆపై దహనమై, మళ్లీ ఉదయిస్తాడు. ఇక ఈ పరిణామాలు 12 రాశుల వారి జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా కొన్ని రాశులకు కర్కాటక రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆగస్టు 7వ తేదీన శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో మేషరాశి, మిధున రాశి, తులా రాశి, వృశ్చిక రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది.

మేషరాశి వారు జీవితంలో అన్ని విలాసాలను పొందడానికి ఇది సరైన సమయం. కర్కాటక రాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల మేషరాశి వారి జీవితాలలో ఇబ్బందులు తొలగిపోతాయి. వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. వర్తక, వాణిజ్యాలు బాగుంటాయి. వ్యాపారం నుండి కావలసిన ధనాన్ని సంపాదిస్తారు. వ్యాపార ఒప్పందాలు విజయవంతమవుతాయి. మేషరాశి జాతకులు తల్లి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.

Venus transit in cancer in august; luck to these 4 zodiac signs!!

కర్కాటక రాశిలో శుక్ర సంచారం వల్ల మిధున రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. శుక్ర సంచారం వల్ల మిధున రాశి జాతకులు డబ్బును పొదుపు చేస్తారు. ఖర్చులను నియంత్రిస్తారు. మీరు కొత్త ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. మిధున రాశి జాతకులు పనిలో ప్రమోషన్ పొందుతారు. విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం.

కర్కాటకంలో శుక్ర సంచారం వల్ల తులారాశి జాతకులు మెరుగైన ప్రయోజనాలను పొందుతారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సత్వర పరిష్కారాలను పొందుతారు. పనిలో ప్రశాంతంగా ఉండడానికి ఉంటుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన పనులన్నీ సవ్యంగా సాగుతాయి. వ్యాపార పనితీరును మెరుగుపరచడానికి ఇది అనుకూలమైన సమయం.

కర్కాటకంలో శుక్ర సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడానికి, జీవితంలో సరైన ఉద్యోగం పొందడానికి సరైన సమయం. ఈ సమయములో అన్ని ఆర్థిక ఇబ్బందులు పరిష్కారమవుతాయి. భాగస్వాములతో సరైన ఒప్పందాలను ప్లాన్ చేస్తే మంచిది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+