సింహరాశిలోకి శుక్రుడు.. అక్టోబర్ లో వీళ్ళకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుంది!!
అన్ని రాశుల వారి జీవితాలపై అక్టోబర్ నెల ప్రభావాన్ని చూపించబోతోంది. నెలలో కొన్ని ముఖ్యమైన రాశుల సంచారం ద్వాదశ రాశుల వారికి అనుకూల మరియు ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. అక్టోబర్ మొదటి వారంలో అనేక గ్రహాలు తమ స్థానాలను మార్చుకొకోనున్నాయి. అందులో ముఖ్యంగా అక్టోబర్ రెండవ తేదీ అర్ధరాత్రి ఒంటిగంట రెండు నిమిషాలకు శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
కర్కాటక రాశి: శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల కర్కాటక రాశి వారు సానుకూల ఫలితాలను పొందుతారు. శుక్రుడు సింహరాశిలో ప్రవేశించడం వల్ల కర్కాటక రాశి వారి కెరీర్ బాగుంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు దక్కే అవకాశం ఉంది. ఆదాయం కోసం కొత్త మార్గాలు తెరవబడతాయి. డబ్బు ఆదా చేయబడుతుంది. కుటుంబానికి లేదా పిల్లలకు సంబంధించి సంతోషకరమైన వార్తలు వింటారు. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా తిరుగుండదు.

కన్యారాశి: సింహరాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల కన్యా రాశి వారికి లాభిస్తుంది. కన్య రాశి జాతకులకు ఈ సమయంలో అన్ని రంగాలలోనూ కలిసొస్తుంది. అన్ని రంగాలలోని వారికి శుభవార్తలు వినడానికి ఇది సరైన సమయం. శుక్ర సంచారం కన్య రాశి జాతకుల జీవితాలలో ఆనందాన్ని బహుమతిగా తెస్తుంది. కొత్త విజయాలను సాధించడానికి ఇది సరైన సమయం. ఏ పని చేపట్టినా అది విజయవంతంగా మారుతుంది. ఆర్థికంగానూ ఇది లాభాలను చేకూర్చే సమయం.
వృశ్చిక రాశి: సింహరాశిలో శుక్ర సంచారం వృశ్చిక రాశి వారికి శ్రేయస్సును తీసుకువస్తుంది. ఈ కాలంలో మీరు సంపదను కూడబెట్టవచ్చు .కొత్త ఆదాయ వనరులను ఏర్పరచుకోవచ్చు. ప్రయాణ ప్రణాళికలు కూడా ఈ సమయంలో విజయవంతమవుతాయి. ఈ సమయంలో మీ పరిస్థితులు మరింత అనుకూలంగా మారుతాయి. ఆర్థికంగానూ ఇది అనుకూలమైన సమయం. మీకు కొత్త కెరీర్ అవకాశాలు రావడానికి ఇదే సరైన సమయం.మొత్తం మీద మీరు మీ జీవితంలో అనుకూలమైన దశలోకి ప్రవేశించడానికి ఇది సరైన సమయమని చెప్పబడింది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications