2025 ఆరంభంలోనే వీరిపై కనకవర్షం కురిపిస్తానని మాటిచ్చిన శుక్రుడు!

వేద జ్యోతిష శాస్త్రంలో శుక్ర గ్రహానికి తనదైన స్థానం ఉంటుంది. 2025 సంవత్సరంలో శుక్రుడు తన ఉచ్చమైన మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మీనరాశిలో శుక్ర సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. శుక్రుడు దాదాపు 25 రోజులకు ఒకసారి ఒక రాశి నుండి మరొక రాశికి సంచారం చేస్తాడు. శుక్రుడిని జ్యోతిష్య శాస్త్రంలో విలాసాలకు అధిపతిగా పరిగణిస్తారు.

మీనరాశిలో శుక్ర సంచారం
ప్రస్తుతం ధనస్సు రాశిలో ఉన్న శుక్రుడు, ఈ ఏడాది చివర్లో కుంభరాశిలోకి, ఆ తర్వాత 2025 జనవరి 28వ తేదీ ఉదయం 7 గంటల 12 నిమిషాలకు మీన రాశిలోకి వెళతాడు. ఈ రాశిలో శుక్రుడు మంచి స్థానంలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

Venus transit in pisces in 2025 january these zodica signs will get wealth and good fortune

మేషరాశి
మీనరాశిలో శుక్ర సంచారం మేషరాశి వారికి అదృష్టంగా ఉంటుంది. ఈ సమయంలో మేషరాశి వారికి కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. అలాగే పాత ఆదాయ వనరుల నుండి కూడా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరించడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో ధనప్రవాహం నిరంతరంగా కొనసాగుతుంది. వృత్తిపరంగా ఎదగడానికి కూడా ఇది అనుకూలమైన సమయం.

వృషభ రాశి
మీనరాశిలో శుక్ర సంచారం వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలను కలిగిస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి వారి వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. ఈ సమయంలో ఆదాయం క్రమంగా పెరుగుతుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు సైతం ఈ సమయంలో లబ్ధి పొందుతారు. పనులన్నీ సకాలంలో పూర్తయి ఆర్థికంగా దృఢంగా తయారవుతారు.

కుంభరాశి
కుంభ రాశి వారికి శుక్ర సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. మీనరాశిలో శుక్ర సంచారం కుంభ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలను తెస్తుంది. ఈ సమయంలో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ఆర్దిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇళ్లలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కుంభ రాశి వారు మంచి ఉద్యోగ ఆఫర్లను పొందుతారు. ఎప్పటినుంచో నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇక పనితీరులో కూడా మార్పు రానుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+