త్వరలో వీరికి డబ్బుల మూటలను, విలాసాలను ప్రకటించిన శుక్రుడు!
విలాసాలకు అధిపతి శుక్రుడు. వేద జ్యోతిష శాస్త్రంలో శుక్ర గ్రహానికి ఉండే స్థానం చాలా ప్రత్యేకం. అటువంటి శుక్రుడు జాతకంలో మంచి స్థానంలో ఉంటే శుభ ఫలితాలు, చెడు స్థానంలో ఉంటే అశుభ ఫలితాలు వస్తాయి. అయితే సెప్టెంబర్ మాసంలో శుక్రుడు నీచరాశి నుండి తన సొంత రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.
తులారాశిలోకి శుక్రుడు
భాద్రపద శుక్లపక్ష పూర్ణిమ తిధినాడు సెప్టెంబర్ 18వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నాలుగు నిమిషాలకు శుక్రుడు నీచ రాశి అయిన కన్యారాశి నుండి తన సొంత రాశి అయిన తులా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు తులా రాశిలో ప్రవేశించటం కారణంగా అన్ని రాశుల వారి పైన ప్రభావం పడుతుంది. అయితే ముఖ్యంగా మూడు రాశులవారికి మాత్రం మంచి ఫలితాలు వస్తాయి. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
శుక్రుడు కన్యారాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించడం వల్ల సెప్టెంబర్ మాసంలో జరిగే శుక్ర గోచారం కారణంగా మేషరాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. మరో పది రోజుల్లో మేషరాశి జాతకులు మంచి ఫలితాలను అందుకోబోతున్నారు. ఈ సమయంలో మేషరాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి.
తులారాశి
కన్యరాశి నుండి తులా రాశిలోకి శుక్ర సంచారం కారణంగా తులారాశి జాతకులకు కలిసి వస్తుంది. తులారాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు. శుక్ర సంచారం కారణంగా వీరికి నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. కెరీర్ కూడా చాలా బాగుంటుంది వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యుల మద్దతు దొరుకుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేస్తే మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది.
మకర రాశి
కన్యారాశి నుండి తులా రాశిలోకి శుక్ర సంచారం కారణంగా మకర రాశి జాతకులకు లబ్ధి చేకూరుతుంది. ఈ సమయంలో మకర రాశి వారు ఆర్థికంగా బలోపేతంగా ఉంటారు. కొత్త బాధ్యతలను స్వీకరించి ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. మకర రాశి వారి కుటుంబ జీవనం ఈ సమయంలో సంతోషదాయకంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications