కార్తీకంలో ఆగకుండా వీరికి కాసులవర్షం కురిపిస్తున్న శుక్రుడు!
వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా రాశుల వారి జీవితంలో ప్రభావం చోటు చేసుకుంటున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు నిన్న ఉదయం 3.39 నిమిషాలకు మూలా నక్షత్రం లోకి ప్రవేశించాడు. ఇక మూల నక్షత్రంలోనే శుక్రుడు నవంబర్ 18వ తేదీ వరకు ఉండి పూర్వాషాడ నక్షత్రం లోనికి వెళ్తాడు.
కేతువు నక్షత్రంలోకి శుక్రుడు
కేతువు నక్షత్రమైన మూలా నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుతాయి. సంపదలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు కేతు నక్షత్ర సంచారం కారణంగా ప్రభావితం అయ్యే ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేష రాశి
మూలా నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా మేష రాశి వారికి బాగా కలిసి వస్తుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో కుటుంబం నుంచి సంపూర్ణ మద్దతును పొందుతారు. ముఖ్యమైన పనులలో విజయాలు సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక పురోగతి ఉంటుంది. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. మూలా నక్షత్రంలో శుక్ర సంచారం మేష రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది.
వృషభరాశి
శుక్రుడి నక్షత్ర గోచారం వృషభ రాశి వారి పైన సానుకూల ప్రభావాలను చూపిస్తుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలలో ఎదుగుదల ఉంటుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో శుభవార్తలు వింటారు. ఈ సమయంలో చేసే ప్రయాణాలు ప్రయోజనాలను చేకూరుస్తాయి. విద్యార్థులకు ఈ సమయం మంచి సమయం.
కన్యారాశి
కేతువు నక్షత్రం లోనికి శుక్ర సంచారం జరగడం వల్ల కన్యారాశి జాతకులకు మంచి జరుగుతుంది. ఈ సమయంలో కన్యా రాశి వారి ఆదాయ వనరులు పెరుగుతాయి. వర్ధక వ్యాపారాలను నిర్వహించడంలో విజయాలను సాధిస్తారు. ఆర్థికంగా పురోగతి సాధ్యమవుతుంది. శత్రువుల పైన విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. ప్రణాళిక ప్రకారం చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి.. ఇది కన్యా రాశి జాతకులకు అదృష్ట సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications