నేటినుండి శతభిషా నక్షత్రంలో శుక్ర సంచారం.. వీరి పంట పండుతుంది!
వేద జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి, నక్షత్రాలలోకి సంచారం చేస్తూ ఉంటాయి. నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేసే గ్రహాలు అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. నవగ్రహాలలో సంపదలకు, ప్రేమకు, విలాసాలకు అధిపతిగా శుక్రుడిని భావిస్తారు.
శుక్ర సంచారంతో లబ్ది పొందే రాశులు
అటువంటి శుక్రుడు కొన్ని రాశులవారికి అదృష్టాన్ని ఇస్తాడు. ముఖ్యంగా శుక్రుడు ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 8 గంటల 56 నిమిషాలకు ధనిష్ట నక్షత్రం నుంచి నిష్క్రమించి, శతభిషా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇదే నక్షత్రంలో శుక్రుడు ఫిబ్రవరి 22వ తేదీ వరకు సంచారం చేయనున్నాడు. శుక్ర సంచారంతో అదృష్టాన్ని పొందే ఆ రాశులేమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి శుక్రుడి నక్షత్ర మార్పు అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి వారికి వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. సమాజంలో గౌరవ లభిస్తుంది. వృషభ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వస్తాయి. ఉద్యోగుల కెరీర్ పరంగా మంచి విజయాలను సాధిస్తారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు.
మిధున రాశి
శుక్రుడి నక్షత్ర మార్పు మిధున రాశి జాతకులకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో మిధున రాశి వారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ప్రేమ జీవితంలో విజయాలను సాధిస్తారు. కుటుంబంతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి అనేక లాభాలు వస్తాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు.
తులా రాశి
శుక్రుడి నక్షత్ర మార్పు తులా రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో తులా రాశి వారు ఉద్యోగం గురించి శుభవార్తలు వింటారు. ఆదాయంలో గణనీయమైన మార్పులు వస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
కుంభరాశి
శుక్రుడి నక్షత్ర మార్పు కుంభ రాశి వారికి అన్ని విధాల శుభ ఫలితాలను ఇస్తుంది. శతభిష నక్షత్రంలో శుక్రుడి సంచారం కారణంగా వీరికి కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. కుంభ రాశి వారిలో నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు తొలగిపోతాయి. కుంభరాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుంభ రాశి వారు లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం సాధిస్తారు.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications