వినాయక చవితి 2023: 300ఏళ్ళ తర్వాత మూడు అద్భుతమైన యోగాలతో వారికి లక్!!
దేశవ్యాప్తంగా హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో గణేష్ చతుర్థి వేడుకలను జరుపుకుంటారు. సనాతన ధర్మంలో మొదట పూజించేది వినాయకుడినే. మొదట విఘ్నేశ్వరుడి పూజతోనే ఎక్కడైనా అన్ని పూజలు కొనసాగుతాయి. అటువంటి గణేష్ చతుర్థి వస్తుందంటే చిన్న, పెద్ద, పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరు గణనాధుని పూజించడానికి రెడీ అయిపోతారు.
విఘ్నాలను తొలగించే వినాయకుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఇక 2023 వ సంవత్సరంలో గణేష్ చతుర్థి ఎప్పుడు వస్తుంది? ఈ సంవత్సరం గణేష్ చతుర్థి ప్రత్యేకత ఏమిటి? వంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం చవితి తిధి సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12 :39 నిమిషాలకు ప్రారంభమై 19వ తేదీన మధ్యాహ్నం 1: 43 నిమిషాల వరకు ఉంటుంది.

అయితే కొందరు 18వ తేదీన వినాయక చవితిని చేసుకోవడానికి రెడీ అవుతుంటే కొందరు ఉదయం ఉన్న తిథిని ప్రామాణికంగా తీసుకునే క్రమంలో 19వ తేదీన వినాయక చవితిని జరుపుకోనున్నారు. ఇక వినాయక ప్రతిష్టకు 11.01నిముషం నుండి 1:28 నిముషాల వరకు ఎప్పుడైనా ప్రతిష్టించుకోవచ్చు. అయితే 18వ తేదీ, 19 వ తేదీ రాత్రి చంద్రుని చూడరాదు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ నాడు అద్భుతమైన శుభ యోగాలు ఏర్పడనున్నాయి.300 సంవత్సరాల తర్వాత గణేష్ చతుర్థి రోజున మూడు శుభ యోగాలు ఏర్పడనున్నాయి . అందుకే ఈ సంవత్సరం వినాయక చవితి చాలా ప్రత్యేకమైనదిగా చెబుతున్నారు . గణేష్ చతుర్థి రోజున బ్రహ్మ యోగం, శుక్ల యోగం, శుభయోగం ఏర్పడడం వల్ల వివిధ రాశుల వారి జాతకాలు మారనున్నాయి.
వినాయకుడి దయతో వారి జీవితాలలో అదృష్టం ప్రకాశించబోతుంది. మేష రాశి, మిధున రాశి, మకర రాశి వారి జీవితాలలో వినాయక చవితి రోజు ఏర్పడే అద్భుతమైన యోగాల వల్ల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి.గణనాధుడి అనుగ్రహంతో వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.












Click it and Unblock the Notifications