విప్రీత్ రాజయోగం: ఈ రాశుల వారి దశ తిరిగినట్టే!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో వివిధ రాశుల లోకి గ్రహాల సంచారం కారణంగా అనేక శుభ యోగాలు, అశుభ యోగాలు కలుగుతాయి. అయితే మార్చి నెలలో బుధ సంచారం వల్ల కలిగే విప్రీత్ రాజయోగం అనేక రాశుల వారికి శుభ ఫలితాలను చేకూరుస్తుంది. విప్రీత్ రాజయోగం ఒక శుభయోగం. దీని కారణంగా లబ్ధి జరిగే ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
కర్కాటక రాశి
మార్చి నెలలో బుధుడు కర్కాటకరాశిలో భాగ్య స్థానానికి వెళుతున్నాడు. ఈ క్రమంలో వీరికి విప్రీత్ రాజయోగం ఏర్పడుతుంది. దీనివలన మీరు పనిలో పూర్తి మద్దతును అదృష్టాన్ని పొందుతారు. ఆగిపోయిన పనులను పూర్తి చేయగలుగుతారు. విహారయాత్రలు, సుఖవంతమైన ప్రయాణాలు చేస్తారు. కర్కాటకరాశి జాతకులకు కొత్త ఆదాయ అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు లాభసాటిగా ఉంటుంది. పోటీపరీక్షలు రాసేవారికి ఇది సరైన సమయం. ఈ సమయంలో మీరు ఎందులో పెట్టుబడి పెట్టిన
లాభాలు వస్తాయి.

కన్యా రాశి
విప్రీత్ రాజయోగం కారణంగా కన్యారాశి జాతకులు అదృష్టవంతులు అవుతారు. బుధుడు కన్యారాశిలో 6వ ఇంటిలో యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ యోగం కారణంగా వ్యాపారాలు చేసుకునే వారికి అద్భుతమైన లాభాలు వస్తాయి. పనిచేసే చోట మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు పురోభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటే, ఇప్పుడు మీరు దానిని పొందే అవకాశం ఉంటుంది. మీ సీనియర్ అధికారులు మీ ప్రయత్నాలను మెచ్చుకుంటారు.
ధనుస్సు రాశి
విప్రీత్ రాజయోగం కారణంగా ధనస్సు రాశి వారికి కలిసి వస్తుంది. బుధుడు ఈ రాశిలోని మూడవ ఇంటి గుండా కదులుతాడు. కాబట్టి ఇది వీరికి గొప్ప లాభాన్ని చేకూరుస్తుంది. ధనస్సు రాశి వారి ధైర్యం మరింత పెరుగుతుంది. మీ ధైర్యసాహసాలు కొనియాడబడతాయి. మీరు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఊహించని ధనలాభం ఉంటుంది. వ్యాపారస్తులు తమ పనుల వల్ల లబ్ధి పొందుతారు. లాటరీలో పెట్టుబడి పెట్టేవారికి ఈ సమయం కలిసొస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
today rashiphalalu: నేడు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి సంపన్నులయ్యే రాశులవారు వీరే! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications