కుబేర యోగంతో మూడు రోజుల్లో ఈ రాశులవారు కుబేరులవుతారు
నవగ్రహాలలో అత్యంత ముఖ్యమైన గ్రహంగా బృహస్పతిని చెబుతారు. బృహస్పతి 12 నెలలకు ఒకసారి తన రాశి చక్రాన్ని మార్చుకుంటాడు. మే 1వ తేదీన బృహస్పతి మేషరాశి నుంచి వృషభ రాశి వారికి ప్రవేశిస్తాడు. ఇక వృషభ రాశిలో బృహస్పతి సంచారం కారణంగా అత్యంత అద్భుతమైన శుభయోగం, సంపదను శ్రేయస్సును కలిగించే యోగం కుబేర యోగం ఏర్పడుతుంది.
కుబేరయోగంతో ఈ రాశులవారికి సంపదలు
కుబేర యోగం ప్రభావం అన్ని రాశులవారి పైన తప్పనిసరిగా ఉంటుంది. కుబేర యోగం కొన్ని రాశులకు అత్యద్భుత ఫలితాలను ఇస్తుంది. సంపదలకు దేవుడిగా భావించే కుబేరుడు ఏ రాశుల వారికి సంపదను, ఐశ్వర్యాన్ని, ఇవ్వబోతున్నాడో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మే 1వ తేదీన బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించి సంచరించనున్న నేపథ్యంలో ఏర్పడుతున్న కుబేర యోగంతో వృషభ రాశి జాతకులకు, కర్కాటక రాశి జాతకులకు, జాతకులకు అపారమైన సంపదలు కలుగుతాయి.

వృషభ రాశి
కుబేర యోగం కారణంగా వృషభ రాశి జాతకుల ఆర్థిక పరిస్థితుల్లో చాలా మార్పు వస్తుంది. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. శారీరక, మానసిక సమస్యలు తొలగిపోయి సుఖ సంతోషాలతో, సంపదలతో జీవిస్తారు. ఉద్యోగాలు చేసేవారు కార్యాలయంలో ఎదుర్కొనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో భౌతిక ఆనందం పెరుగుతుంది. వృషభ రాశి వారు ఈ సమయంలో అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. విలాసవంతమైన జీవితాన్ని మీరు గడుపుతారు.
కర్కాటక రాశి
కుబేర యోగం కారణంగా కర్కాటక రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు కనిపిస్తాయి. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. కెరీర్ లోను మంచి మార్పులతో, జీవితం చాలా సంతోషదాయకం గా ఉంటుంది.
కన్యారాశి
కుబేర యోగం కారణంగా కన్యారాశి జాతకులకు అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది. సంపత్తి తో పాటు సంతోషం కూడా ఉండడంతో ఈ సమయంలో వీరి ఆనందానికి అవధులు ఉండవు. వ్యాపారంలో మీరు గణనీయమైన పురోగతిని సాధిస్తారు. ఈ సమయంలో వీరు డబ్బుకు సంబంధించిన సమస్యలను అధిగమిస్తారు. సంపద వచ్చి పడుతుంది. ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. కుటుంబం కోసం సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు. ఫలితంగా వ్యక్తిగత సంబంధాలు కూడా బలపడతాయి. వ్యాపార విస్తరణకు కూడా అవకాశాలుంటాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications