రేపటి నుండి నెలరోజులు ఈరాశులవారికి సంపదల దసరా!
అక్టోబర్ మాసం రానే వచ్చింది. అక్టోబర్ మాసంలో గ్రహాల సంచారం కారణంగా కొన్ని ప్రత్యేకమైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి. కొన్ని రాశుల్లో పుట్టిన వారికి ఈ రాజయోగాలు అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా దుర్గా నవరాత్రులలో ఏర్పడే ప్రత్యేకమైన కొన్ని యోగాల కారణంగా కొన్ని రాశుల వారి పైన ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రభావం పడుతుంది.
అక్టోబర్ ముఖ్య గ్రహాల రవాణా
ముఖ్య గ్రహాలైన సూర్యుడు, శుక్రుడు, బుధుడు, బృహస్పతి ప్రభావం ఆయా రాశులవారిపై ఉంటుంది. అక్టోబర్ నెలలో విశేషమైన పండుగలు ఉన్న కారణంగా గ్రహాల సంచారం ప్రభావం రాశుల వారి పైన ఏ విధంగా ఉంటుంది? ఏ రాశిలో ఉన్నవారు అదృష్ట రాశులుగా అక్టోబర్ మాసంలో కొనసాగనున్నారు అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
అక్టోబర్ నెలలో వృషభ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. వృషభ రాశి జాతకులు ఈ నెలలో విశేషమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో వీరు పూర్తి చేయాలనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థికంగా విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఐశ్వర్యంతో పాటు ఆనందం కూడా వీరి జీవితంలో ఉంటుంది. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.
మిధున రాశి
మిధున రాశి వారికి అక్టోబర్ నెల సానుకూల ఫలితాలను ఇస్తుంది. మిధున రాశి వారు ఈ సమయంలో ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
సింహరాశి
సింహ రాశి వారికి అక్టోబర్ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. సింహ రాశి వారు ఈ సమయంలో కెరీర్ కి సంబంధించిన శుభవార్తలు వింటారు. పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు వారి మధ్య చోటు చేసుకున్న సమస్యలను పరిష్కరించుకుంటారు. ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులనైనా సునాయసంగా పరిష్కరిస్తారు.
కన్య రాశి
కన్యా రాశి జాతకులకు అక్టోబర్ నెల కలిసొస్తుంది. ఈ సమయంలో కన్యారాశి జాతకుల ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇది నిజంగా కన్యా రాశి వారికి అదృష్ట కాలం.
తులారాశి
తులా రాశి వారికి అక్టోబర్ నెల శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులు ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. కెరీర్ కు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వీరి కుటుంబ జీవితం ఈ సమయంలో సంతోషంగా ఉంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు అక్టోబర్ నెల అదృష్టాన్నిస్తుంది. కర్కాటక రాశి జాతకుల కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఏ పని చేసినా అదృష్ట లక్ష్మి వరిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications