weekly horoscope: మేషరాశి నుండి కన్యారాశి వరకు.. ఎవరికి అదృష్టం? ఎవరిది దురదృష్టం!!
ఫిబ్రవరి 4వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది? ఏ రాశుల వారిని దురదృష్టం వెంటాడుతుంది? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? వంటి అనేక అంశాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఫిబ్రవరి 4వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మేషరాశి నుండి కన్యారాశి వరకు వారఫలాలను చూసుకుంటే..
మేషరాశి: మేషరాశి వారికి ఈ వారం గ్రహబలం అనుకూలంగా ఉన్నందువల్ల వారం అంతా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. మేష రాశి వారి ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి జీవితం మీద బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఆదాయానికి మించిన ఖర్చులు ఉండొచ్చన్నది గమనార్హం.

వృషభరాశి: వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశి జాతకులు ఈ వారంలో మౌనంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. తొందరపాటు తనంతో మాట్లాడితే అప్పుడు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సంపాదన పెరిగే అవకాశం ఉంటుంది.
మిధునరాశి: మిధున రాశి వారికి వృత్తి ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం, జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. వృత్తి వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. మిధున రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. ఆదాయానికి లోటు ఉండదు. కుటుంబ సభ్యులతో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు.
కర్కాటకరాశి: కర్కాటక రాశి వారు ఈ వారం సానుకూల ఫలితాలను పొందుతారు. ఆదాయంలో మెరుగుదల ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా కర్కాటక రాశి వారికి స్థిరత్వం లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా, ఏ పని మొదలుపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో కలిసివస్తుంది. అయితే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిదని సలహా ఇవ్వబడింది.
సింహరాశి: సింహ రాశి వారు ఈ వారం మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. ముఖ్యమైన పనులను పూర్తి చేయడంలో సింహ రాశి వారు ఒత్తిడిని ఎదుర్కొంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా కొనసాగుతాయి. సింహరాశి వారి ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. విద్యార్థులు తక్కువ శ్రమతో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు.
కన్యారాశి: కన్యా రాశి వారికి ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. కన్య రాశి వారికి ఈ వారమంతా బయట కొన్ని సమస్యలు, ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఈ సమయంలో వ్యాపారాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే కుటుంబ సభ్యులతో విభేదాలు లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అదనపు బాధ్యతలు ఈ సమయంలో మీద పడడంతో కన్య రాశి వారు చిరాకు పడాల్సి వస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications