మే 8 నుంచి 14 వరకు రాశిఫలాలు.. ఈ రాశులవారికి ఆర్థిక లాభం
మే 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వివిధ రాశులవారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.
మేష రాశి: ఈ రాశివారికి వారం ప్రారంభంలో మంచి లాభాలుంటాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. వారం మధ్యలో ప్రయాణం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. హనుమంతుడిని పూజించడంవల్ల అంతా మంచి జరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ లక్ష్యాన్ని మార్చుకునే అవకాశం ఉంది.

కర్కాటక రాశి: గతవారం కన్నా ఈ వారం బాగుంటుంది. పెద్ద సమస్య నుంచి బయటపడతారు. ఇనుమడించిన ఉత్సాహంతో లక్ష్యం దిశగా ప్రయత్నిస్తారు. ఈ వారం చివరినాటికి విదేశాల కోసం ఎదురుచూస్తున్న అవకాశం ఫలిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆహారం, దినచర్య విషయంలో చిన్న పొరపాటు కూడా చేయకూడదు. ఓ శుభకార్యంలో పాల్గొంటారు. ప్రతి రోజు శ్రీ సూక్తాన్ని పఠించాలి.
సింహ రాశి: పెద్ద విజయానికి సంబంధించిన సమాచారం అందుతుంది. ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. పనిలో ఆశించిన విజయం దక్కుతుంది. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో చర్చించి ఆస్తికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రతిరోజు మహావిష్ణువును ఆరాధించాలి.
కన్యా రాశి: ఈ రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలుంటాయి. మంచి సమర్థుడైన వ్యక్తితో కలిసి కెరీర్ పరంగా ముందడుగు పడుతుంది. ఇంట్లో శుభకార్యాల కోసం ప్రణాళికలు రచించుకుంటారు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి మద్దతుతో అతి పెద్ద ఆందోళన నుంచి బయటపడతారు. ప్రతిరోజు దుర్గాదేవిని ఆరాధించాలి.
ధనుస్సు రాశి: వృత్తి వ్యాపారానికి సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. కొంతకాలం నుంచి వేధిస్తోన్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఫలిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంతో కలిసి ఆకస్మికంగా పర్యాటక ప్రదేశానికి యాత్ర ప్లాన్ చేస్తారు. భార్యాభర్తల మధ్య సహృద్భావ వాతావరణం నెలకొంటుంది. శ్రీ విష్ణును ఆరాధించాలి.
కుంభ రాశి: పని కోసం కొంతకాలంగా వేచిచూస్తున్నవారి కోరిక నెరవేరుతుంది. తెలివితేటలతో పెద్ద పనిని కూడా సులభంగా చేస్తారు. ఉద్యోగస్తులకు సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు పొందుతారు.
గతంలో ఒక పథకంలో పెట్టుబడి పెట్టిన డబ్బు నుంచి ఇప్పుడు ప్రయోజనాన్ని పొందవచ్చు. వారం ద్వితీయార్థంలో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. భాగస్వామితో ఆహ్లాదకరమైన సమయాన్ని గడపడానికి అవకాశాలు దొరుకుతాయి. శివారాధన మంచి చేస్తుంది.












Click it and Unblock the Notifications