నమ్మిన సిద్ధాంతంతోనే ముందుకు వెళ్లాలి.. లక్ష్మీదేవిని ధ్యానించాలి
గ్రహాలు నిర్దేశిత సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచరించే క్రమంలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఎదురైతే, మరికొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, కుటుంబ పరంగా ఈ వారం ఎలా ఉంది? ప్రతికూలతలు ఉంటే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? తదితర విషయాలపై వారఫలాలను తెలుసుకుందాం.
మేష రాశి: అంతా కలిసి వస్తుంది. పట్టుదలతో పనిచేస్తే విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. గిట్టనివారు ఇబ్బంది పెట్టాలనుకున్నప్పటికీ మీ సంస్కారం మిమ్మల్ని కాపాడుతుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులవల్ల లాభం ఉంది. శివుణ్ని ఆరాధించాలి.

వృషభ రాశి: ఉద్యోగంలో ఎటు చూసిన విజయమే కనపడుతోంది. ఆశయాలు నెరవేరతాయి. వ్యాపారంలో కొన్ని మార్గాల్లో లాభాలున్నాయి. గృహ, భూ, వాహనాది యోగాలున్నాయి. లక్ష్మీదేవిని ధ్యానించాలి. చంచల మనస్తత్వం పనికిరాదు.
మిథున రాశి: ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను పూర్తిచేయాలి. భవిష్యత్తు బాగుంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. శ్రేయోభిలాషులు ఇచ్చే సూచనలు పనిచేస్తాయి. దేన్నైతో నమ్ముతారో ఆ సిద్ధాంతోనే ముందుకు వెళ్లాలి. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు విజయం సాధిస్తాయి. ఇష్టదేవతను స్మరించాలి.
కర్కాటక రాశి: వ్యాపార యోగం బాగుంది. స్థిరాస్తులు వృద్ధి చెందడంతోపాటు ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. అసంతృప్తి చెందకూడదు. చెడును అసలు తలుచుకోవద్దు. ఉద్యోగంలో ఆటంకాలున్నాయి. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత విషయాల్లో గోప్యత అవసరం. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి.

సింహ రాశి: అదృష్టం తోడుంటుంది. ధర్మమార్గంలో ప్రయత్నాలుండాలి. ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. తీసుకునే నిర్ణయాలపై ప్రశంసలు వస్తాయి. సిరిసంపదలు సమకూరుతాయి. విష్ణు మూర్తి దర్శనం శుభప్రదంగా ఉంటుంది.
కన్యా రాశి: కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. వ్యాపారాలు బాగుంటాయి. మంచి సంకల్పంతో చేసే పనులు విజయవంతమవుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలి. ఇష్టదేవతను స్మరించాలి.












Click it and Unblock the Notifications