weekly horoscope: ఈ వారం మేషరాశి నుండి కన్యారాశి వరకు.. ముఖ్యమైన అనుకూలతలివే!!
హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుత వారం హస్తా నక్షత్ర ప్రభావంతో శుక్లపక్షం షష్టి తిథినాడు ప్రారంభమై, మూలా నక్షత్ర ప్రభావంతో శుక్లపక్షం ద్వాదశి తిథితో జులై 30వ తేదీన ముగుస్తుంది. అంతేకాదు ఈ వారంలో రెండు ముఖ్యమైన గ్రహాల సంచారం రాశి చక్ర జాతకుల పై ప్రభావాన్ని చూపిస్తుంది. కొందరికి ఈ వారం చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తే, మరికొందరికి ఈ వారం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది.
ఈ వారం మేషరాశి నుండి కన్యా రాశి వరకు వివిధ రాశులకు ఉండే అనుకూలమైన ప్రయోజనాలను తెలుసుకుందాం.మేషరాశి వారికి ఈ వారం వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. పరిస్థితులు అనుకూలించి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఇది జీవితంలోని అన్నిరంగాలలో విజయం సాధించడానికి మీకు సహాయపడుతుంది . కచ్చితంగా ఈ సమయంలో కెరీర్ పురోగతి అవుతుంది. ఇతరులను ఒప్పించగలిగిన మీ సామర్థ్యం ఈ వారం మీ కుటుంబ శాంతికి కారణమవుతుంది.

వృషభరాశి వారికి కూడా ఈ వారం జాతకంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కుటుంబ జీవితం బాగా ఉంటుంది. ఈవారం వీరు ఆస్తి కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. గతంలో చేసిన అనేక పనుల ప్రయోజనం ఈ వారంలో లాభిస్తుంది. ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు పొందడానికి ఇది సహాయపడుతుంది. కుటుంబంలో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందుతారు. విద్యార్థులకు విద్య విషయంలో అవాంతరాలు తొలగుతాయి. ఈ సమయం విద్యార్థుల ఆలోచనలను, నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది.
ఈ వారం మిధున రాశి వారు రహస్య వనరుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడుల నుండి అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇంటి పనులతో పాటు, సమావేశాలలో కూడా పాల్గొంటారు. ఇక ఆఫీసులో ఉన్న వివాదాలను కూడా పరిష్కరించుకొని ఉన్నతాధికారులతోనూ , కిందిస్థాయి అధికారులతోనూ సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు. ఈ వారం ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ అవకాశాలు పెరుగుతాయి.
కర్కాటక రాశి వారికి ఈవారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం చాలా బాగుంటుంది. భవిష్యత్తులో మీరు డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టడానికి సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులతో మీ సంబంధాలు ఉపయోగపడతాయి. ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలను జీవిత పురోగతికి తెలివిగా వాడుకోవాలని, ఈ సమయం అందుకు అనుకూలమని సూచించబడింది.
సింహరాశి వారి ఈ సమయంలో మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. సింహ రాశి వారు అత్యవసరమైన విషయాలను ఆశీర్వాద దృక్పథంతోనూ, కూల్ మైండ్ తోను ఆలోచించాల్సిన సమయం. సింహరాశి వారి సృజనాత్మకత ఈ సమయంలో బాగా పెరుగుతుంది. వీరికి ఉద్యోగ అవకాశం, లేదా వీరి ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది.
కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ఈవారం వీరి ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదు. ఈవారం ఏదైనా పని విషయంలో మొదట కష్టపడినప్పటికీ తర్వాత వారాంతంలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఈ వారం విద్యారంగంలో వారు చేసిన కృషితో ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచిస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications