• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సద్గురు జ్ఞానం: సత్వగుణ లక్షణాలు, సత్య సోపానాలు

|

డా.యం.ఎన్.చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు, ఫోన్: 9440611151

మనం ఎంత చదివినను పూర్ణత్వం సిద్దించదు.సద్గురుతో సత్సంగాలు చేస్తుంటే మనకున్న విజ్జానం ఎంతదో తెలుస్తుంది. మనకు ఎంత తెలిసిన, ఎంత చదివిన మనకు అర్ధం అయ్యేది కొంత భాగమే నేర్చుకోవలసినది ఎంతో ఉంటుంది.మనం వంద సంవత్సరాలు నిరంతరంగా చదివిననూ మనకు ఈ వంద సంవత్సరాలలో నేర్చుకున్నది, భగవంతున్ని అర్ధం చేసుకున్నది,ఈ సృష్టిలోని పరమార్ధాన్ని తెలుసుకున్నది కేవలం సముద్రంలో నీటి చుక్కంత. నేర్చుకోవలసినది ,తెలుసుకోవలసినది సముద్రమంత కావున మనం అను నిత్యం నిత్యనూతన విద్యార్ధులమే.వరిగింజకూ, బియ్యపు గింజకు మధ్య ఉన్న సంబంధంలో గొప్ప ఆధ్యాత్మిక విజ్ఞాన మున్నది.

పొట్టు ఉంటే వరిగింజ.

పొట్టును తొలగిస్తే బియ్యపుగింజ.

పొట్టు ఉంటే గింజ తిరిగి మొలకెత్తుతుంది.

పొట్టును తొలగించినట్లయితే గింజ తిరిగి మొలకెత్తదు.

పొట్టు అనేది అజ్ఞానం లాంటిది.

అజ్ఞానం ఉంటే జీవుడు.

అజ్ఞానం తొలిగిపోతే దేవుడు.

అజ్ఞానం కలవాడికి పునర్జన్మ ఉన్నది.

అజ్ఞానం తొలగినవాడికి పునర్జన్మ లేదు.

కనుక మనం అందరం సద్గ్రంథ పఠనం చేసి సజ్జన సహవాసం చేస్తూ సద్గురు సేవ చేస్తూ వారి ద్వార ఈ సృష్టిని,భగవంతుని నిగూఢ మర్మాలను తెలుసుకుని మనకున్న నేను అనే అహాన్ని,అజ్ఞానాన్ని తొలగించుకొనే ప్రయత్నం చేయాలి.మనకు తెలిసింది కోంతే,తెలుసుకోవలసినది కొండంత ఉంది.

What is knowledge?

సత్వగుణ లక్షణాలు,సత్య సోపానాలు...

మనో బుద్ధులను దాటటమే అహంకార నాశనం. అసలు నేను అనే దానికి ఉనికి మాత్రమే ఉంటుంది. దానికి నేను అన్న పరిధి చేరితే అది అహంకారంతో కూడిన నేను అవుతుంది.మోక్షం అంటే నిజంగా లేని ఆ అహంకారాన్ని నశింప చేయటమే. అహంకారమే మనసు, బుద్ధి, చిత్తమునలకు ఆధారంగా ఉంటుంది.

అందుకే మన బాహ్య జీవనంలో వ్యక్తం అయ్యే మనసును అహంకార రహితంగా చేసుకుంటే అంతఃకరణలోని అల్లకల్లోలం కూడా మెల్లగా అదృశ్యం అవుతుంది. అహంభావ రహిత జీవనమే సత్వగుణం.మర్యాద, గౌరవం, వినయం, వినమ్రత వంటి సత్వగుణ లక్షణాలు జీవితాన్ని సరళంగా, సౌకర్యవంతంగా చేస్తాయి. ఆ సత్వగుణ లక్షణాలు సత్యానికి సోపానంగా కూడా ఉపకరిస్తాయి.

మానవుడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండమన్నారు పెద్దలు.ఎంత వయస్సు ఉన్న,ఎన్ని చదువులు ఉన్నా సృష్టిలోని రహస్యాన్ని,మానవ జన్మ పరమార్ధం తెలుసుకునే ప్రయత్నంలో లార్వ దశలోనే ఉన్నాడు మానవుడు.మానవ జన్మ అనేది చాలా విశేషమైనది కావున ఈ జన్మ పరమార్ధం గురించి తెలుసుకునే సాధనలో నిరంతరం కృషి,సాధన చేయాలి.వృధా చేయబోకు జన్మం సదా రాదు నీకు. జై శ్రీమన్నారాయణ.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In everyday usage, knowledge refers to awareness of or familiarity with various objects, events, ideas, or ways of doing things.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more