ఆగస్ట్ నెలలో ఈ రాశులవారికి జాక్ పాట్.. మీరున్నారా?
ఆగస్టు నెల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా ముఖ్యమైన నెలగా పరిగణించబడుతుంది . ఎందుకంటే ఈ నెలలో గురు గ్రహంతో పాటు మరికొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ స్థానాలు మార్చుకోబోతున్నాయి. అయినప్పటికీ జ్యోతిష్య శాస్త్రంలో జ్ఞానానికి, అదృష్టానికి, సంపదకు, సంతానానికి, మరియు శ్రేయస్సుకు కారకుడిగా బృహస్పతిని భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో గురుడిని దేవ గురువుగా చెబుతారు.
ఆగస్ట్ లో రెండుసార్లు స్థానం మార్చుకోనున్న గురువు
గురువు బలంగా ఉన్న జాతకులను జీవితంలో కచ్చితంగా విజయం వరిస్తుంది. పెళ్లి ఆలస్యం కాకుండా జరుగుతుంది. పిల్లల గురించి శుభవార్తలు వినే అవకాశం ఉంది.
గురువు స్థానం మారినప్పుడల్లా ఆ ప్రభావం 12 రాశుల వారి జీవితాలపై కనిపిస్తుంది. ఈ ఆగస్టు నెలలో గురువు రెండుసార్లు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు వస్తాయి.

గురువు మార్పుతో కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు
ఆగస్టు 13వ తేదీ ఆదివారం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు గురువు పునర్వసు నక్షత్రం మొదటి పాదం లోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఆగస్టు 30వ తేదీ వరకు అక్కడే ఉండి పునర్వసు నక్షత్రం రెండవ పాదం లోకి మారతాడు. ఈ నెల మొత్తం గురువు మిధున రాశిలో ఉంటాడు. ఇక గురువు రెండుసార్లు నక్షత్రాన్ని మార్పు చేయడం వల్ల కొన్ని రాశుల వారికి బాగుంటుంది.
మేషరాశి
మేష రాశి వారికి గురువు నక్షత్ర సంచారం ఆర్థికంగా లబ్ధిని చేకూరుస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. మేష రాశి వారికి డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఇది మేషరాశి వారికి శుభాలను చేకూర్చే కాలం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలో మంచి ఫలితాలు ఉంటాయి. బృహస్పతి రెండుసార్లు స్థానం మారడం వల్ల కర్కాటక రాశి జాతకులకు కలిసి వస్తుంది. వీరి కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. కర్కాటక రాశి వారికి బంధువులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఎంతోకాలంగా ఉన్న రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది.
మీనరాశి
మీన రాశి వారికి ఈ సమయంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త వ్యాపార భాగస్వాములు కలిసే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు కూడా వస్తాయి. బంధువులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి సమయం దొరుకుతుంది.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications