నేటినుండి కేంద్ర త్రికోణ రాజయోగంతో ఈ రాశులవారు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశిని మార్చుకుంటూ నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు కొన్ని శుభ యోగాలు, కొన్ని అశుభ యోగాలు ఏర్పడతాయి.
కేంద్ర త్రికోణ రాజయోగం అదృష్ట రాశులు
ధన త్రయోదశి నాడు గురువు తన రాశిని మార్చుకుని కర్కాటక రాశిలోనికి ప్రవేశించాడు. కర్కాటక రాశిలో గురు సంచారంతో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడింది. ఇక ఈ రాజయోగం కారణంగా ఈ మాసంలో కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా అదృష్టం వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా జీవిస్తారు. లక్ష్మీదేవి, కుబేరుడి అనుగ్రహం వీరికి కలుగుతుంది. ఆర్థికంగా ఈ రాశి వారికి బాగుంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న అనేక పనులు పూర్తవుతాయి. ఇది కర్కాటక రాశి వారికి అన్ని విధాల శుభాలను చేకూర్చే యోగం.
తులారాశి
తులా రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా జీవిస్తారు. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి శుభ సమయం. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు పురోగతిని చూస్తారు. ఈ సమయంలో తులా రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఈ రాశి వారికి గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా తులా రాశి వారికి ఈ సమయం కలిసి వస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు గురువు సంచారంతో శుభ ఫలితాలను చూస్తారు. ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారు. బాధల నుండి ఉపశమనాన్ని పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది మంచి సమయం. ఈ రాశి వారు బంగారం లేదా కంచు కొనుగోలు చేస్తే బాగా కలిసి వస్తుంది.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications