రెడీ అవ్వండి.. సింహరాశిలో కుజ సంచారంతో వీరికి అఖండ ధనయోగం!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలు వేటికవే ప్రత్యేకమైనవి. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జాతకాలను నిర్ణయిస్తాయి. 2025 సంవత్సరంలో కుజ సంచారం కొన్ని రాశుల వారిని అదృష్ట రాశులుగా మారుస్తుంది. కుజ గ్రహం చాలా శక్తివంతమైన గ్రహం. కుజుడు శక్తికి, ఆవేశానికి, ధైర్యం వంటి లక్షణాలకు ప్రతీకగా చెప్పబడతాడు.
సింహరాశిలో కుజుడు
జాతకంలో కుజుడు స్థానం ఆధారంగా వ్యక్తి యొక్క స్వభావాన్ని, ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని మరియు వివాహ సంబంధ విషయాలను అర్థం చేసుకోవచ్చు. జాతకంలో కుజుడు బలంగా ఉంటే శుభ ఫలితాలు వస్తాయి. బలహీనంగా ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏ పని మీద ఆసక్తి ఉండదు. జూన్ మాసంలో కుజుడు సింహరాశిలోకి సంచరిస్తున్నాడు. సింహరాశిలో కుజ సంచారం కారణంగా లబ్ధిని పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

తులారాశి
తులా రాశి జాతకులకు కుజ సంచారం అనుకూలంగా ఉంటుంది. కుజుడు తులా రాశిలో ఆదాయం మరియు లాభ స్థానంలో ఉంటాడు. కాబట్టి మీ ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కొత్త ఉద్యోగాలు చేయడానికి పెద్ద లక్ష్యాలను చేరుకోవడానికి తులా రాశి వారికి ఇది అనుకూలమైన సమయం. ఈ రాశి వారు ప్రయాణాలు చేసి ప్రయోజనాలను పొందవచ్చు.
సింహరాశి
సింహ రాశి వారికి కుజుడి రాశి మార్పు చాలా సానుకూల ఫలితాలను ఇస్తుంది. సింహరాశిలో కుజుడు లగ్న రాశిలో సంచరించడం వల్ల సింహరాశి జాతకులకు కలిసొస్తుంది. ఈ సమయంలో మీరు వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. జీవితంలో మంచి సమయం ప్రారంభమవుతుంది. ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుతాయి. ఇది సింహ రాశి జాతకులకు శుభ సమయం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి సింహరాశిలో కుజ సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. కుజుడు వృశ్చిక రాశిలో వృత్తి, వ్యాపార స్థానాల నుంచి సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ రాశి వారు వృత్తి, వ్యాపారాలలో మంచి విజయాలను సాధిస్తారు. అంతేకాదు కుజుడి ప్రభావం మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఇది కొత్త ప్రాజెక్టులను స్టార్ట్ చేయడానికి మంచి అవకాశాలను ఇస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications