అక్టోబర్ లో బుధుడి డబుల్ సంచారంతో ఈ రాశులవారు ఏనుగు కుంభస్థలం బద్దలు కొడతారు!
గ్రహాలన్నిటిలోనూ బుధుడికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. బుధుడిని గ్రహాల యువరాజుగా చెబుతారు. గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు సంభాషణకు, లెక్కలకు, స్నేహానికి కారకుడిగా పరిగణించబడతారు. బుధుడు ఒక రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటే ఆ రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయి. అదే నీచ స్థితిలో ఉంటే ఆ రాశి వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి.
అక్టోబర్ మాసంలో బుధుడి డబుల్ సంచారం
అక్టోబర్ మాసంలో బుధుడు రెండుసార్లు తన సంచారంలో మార్పును చూస్తున్నాడు. అక్టోబరు రెండవ తేదీన కన్యా రాశిలో బుధుడు ఉదయిస్తాడు. అక్టోబర్ మూడవ తేదీన బుధుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ మాసంలో బుధుడు డబుల్ సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
మేషరాశి జాతకులు బుధుడి డబుల్ సంచారం కారణంగా అదృష్ట జాతకులు అవుతున్నారు. ఈ సమయంలో వీరికి వ్యాపారంలో పురోభివృద్ధి కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. మేష రాశి వారి ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. వ్యాపారంలో లాభాలు సంతోషాన్ని ఇస్తాయి.
సింహరాశి
సింహ రాశి జాతకులు బుధుడి డబుల్ సంచారం కారణంగా సానుకూల ఫలితాలను పొందుతున్నారు. ఈ సమయంలో కెరీర్ బాగుంటుంది. కొత్త ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. పిల్లలు కెరీర్లో పురోగతిని చూస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. పాత పెట్టుబడులు మంచి రాబడిని ఇచ్చే అవకాశం ఉంది.
తులారాశి
తులారాశి జాతకులు బుధుడి డబుల్ సంచారం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో తులా రాశి వారు ప్రయాణాల ద్వారా లబ్ధిని పొందుతారు. తులా రాశి వారి సంపద పెరుగుతుంది. వ్యాపారం పురోభివృద్ధికి కొత్త అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. కెరీర్ లో మంచి అవకాశాలు ఉంటాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులు బుధుడి డబుల్ సంచారం కారణంగా అదృష్టం కలిసివస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వృత్తి జీవితంలో గణనీయమైన మార్పులు ఉంటాయి. వర్తక వ్యాపారాలను పెంచుకోవడానికి అనేక అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారి ప్రేమ జీవితం బాగుంటుంది. కెరీర్ ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications