వందేళ్ళ తర్వాత త్వరలో పంచగ్రాహి యోగంతో ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టేది వీరే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, సంయోగం కారణంగా అన్ని రాశుల వారి జీవితం పైన ప్రభావం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 జనవరిలో మకర రాశిలో ఐదు గ్రహాలు సంయోగం చెందుతాయి. మకర రాశిలో గ్రహాల సంయోగం కొన్ని రాశులవారికి శుభ ఫలితాలను చేకూరుస్తుంది. మకర రాశిలో ఐదు గ్రహాలు కలిసి సంయోగం చెందటం లబ్ధిని పొందే రాశులు ఏమిటో తెలుసుకుందాం.
మకర రాశిలో పంచ గ్రాహి యోగం
వంద సంవత్సరాల తర్వాత మకర రాశిలో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు కలిసి పంచగ్రాహి యోగాన్ని ఏర్పరుస్తున్నారు. జనవరి 13వ తేదీన శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. జనవరి 14వ తేదీన సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేస్తాడు ఆ తర్వాత జనవరి 16న కుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

ఈ రాశులకు అదృష్టం
జనవరి 18న చంద్రుడు మకర రాశిలోకి వెళతాడు .ఆపై జనవరి 24న బుధుడు మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఈ ఐదు గ్రహాల సంధితో పంచగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగంతో లబ్ధి పొందే రాశులను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేష రాశి
పంచ గ్రహ యోగం కారణంగా మేష రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. వీరి కెరీర్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగం చేసే చోట పదోన్నతులు , ఇంక్రిమెంట్లు వస్తాయి. ఈ సమయంలో శుభవార్తలు వింటారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి
తులారాశి
తులారాశి వారు పంచగ్రాహి యోగం కారణంగా సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది .ఇల్లు వాహనాలు కొనుగోలు చేస్తారు. గౌరవం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తులు వస్తాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు చేసే ప్రయత్నాలలో విజయాలు సాధిస్తారు. ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. కుటుంబ అనుబంధాలు బలోపేతం అవుతాయి. అన్ని విధాల వృశ్చిక రాశి వారికి మేలు జరుగుతుంది.
మకర రాశి
ఈ సమయంలో మకర రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు వస్తాయి. ఉద్యోగ వ్యాపార అవకాశాలు వృద్ధి చెందుతాయి. శక్తి పెరుగుతుంది. పంచ గ్రాహి యోగం అన్ని విధాల లాభాలను ఇస్తుంది.
మీన రాశి
మీన రాశి వారికి ఉద్యోగ సహకారం ఉంటుంది. ఈ సమయంలో వీరి కోరికలు నెరవేరుతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. మీన రాశి వారు ఈ సమయంలో ఏం చేసినా కలిసి వస్తుంది.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications